తూర్పుగోదావరి

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఎన్‌ఎస్‌ఎస్ విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఎన్‌ఎస్‌ఎస్ విభాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఉందని, దేశంలో ఎక్కువ యువశక్తిని కలిగిన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు ఉందని వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆపీసర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కిరణ్ చంద్ర 2018-19 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ వివరాలను వివరించారు. వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ 2018 సెప్టెంబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఎన్‌ఎస్‌ఎస్ యాభై సంవత్సరాల జూబ్లీని చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పిలుపునిచ్చారని, వాటిని విజయవంతం చేయాలన్నారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించాలని వీసీ సూచించారు. తెలుగు రాష్ట్రాల రీజినల్ డైరెక్టర్ గోపాలకృష్ణన్, ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ధ్రాకారి డాక్టర్ పి రామచంద్రరావు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ నిధుల కేటాయింపు పూర్తి బాధ్యత కేంద్రమే నిర్వహిస్తుందని, కాబట్టి నిధుల కొరత వుండదని, సేవా కార్యక్రమాలను విసృతపర్చాలని సూచించారు. ఏభై సంవత్సరాల జూబ్లీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు వెంకట రమణమూర్తి, బి ప్రభాకరరావు, జిల్లా రెడ్‌క్రాస్ సెక్రటరీ శివకుమార్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పెరియార్ జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: రాజమహేంద్రవరం ఓఎన్జీసీ బేస్ క్లాంప్లెక్సులో మంగళవారం అఖిల భారత ఒబిసి, ఎంఒబిసి ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంఘిక సంస్కర్త ఇవి రామస్వామి (తంతి పెరియార్) 140వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశంలో సాంఘిక మార్పు కోసం పెరియార్ చేసిన కృషిని, ఆయన రచనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలలో కులం, మతం అన్నింటినీ సమానంగా చూసే అవకాశం విద్య వల్లే సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ అంబేద్కర్, తంతి పెరియార్ తత్వాలు భారత ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్నాయని, అందువల్ల నేటికీ వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపిస్తున్నాయన్నారు. ఓఎన్జీసీ మహిళా సమితి అధ్యక్షురాలు దుర్గా భవాని శేఖర్ మాట్లాడుతూ పిల్లలు డాక్టర్ అంబేద్కర్, సావిత్రీభాయి పూలే వంటి వారిని అదర్శంగా తీసుకుని ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని కోరారు. సామాజికాభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ బాలికల హాస్టల్‌కు రూ.376347లు, జిల్లాలోని వంద పాఠశాలల్లో విద్యార్థులకు పర్యావరణహితమైన బ్యాగులు, స్టేషనరీల వితరణకు రూ.3,86,845లు చెక్కులను ఈడీ అసెట్ మేనేజర్ శేఖర్ అందజేశశారు. అనంతరం తంతి పెరియార్ డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.