తూర్పుగోదావరి

అంతా భ్రాంతియేనా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: గోదావరి మహా పుష్కరాల సందర్భంగా 2015లో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో సంభవించిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు తీవ్ర నిరాశ మిగిలింది. ఈ దుర్ఘటనలో 27 మంది మృత్యువాత పడగా, 50 మందికి పైగా గాయపడిన సంగతి విదితమే. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన ఈ నివేదికలో పుష్కర ప్రారంభ సమయానికి స్నానం చేయాలని భావించిన భక్తుల సెంటిమెంటు, దీనికి విపరీతమైన ప్రచారం కల్పించిన మీడియాదే తప్పు అని పేర్కొనడంతో అంతా నిర్ఘాంతపోతున్నారు.
ముహూర్తం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరఘాట్‌లో స్నానం ఆచరించి, గోదావరి మహా పుష్కర తీర్ధ విధులు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం మాత్రమే భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటనపై ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 15వ తేదీన జీవో నెంబర్ 125 ప్రకారం జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. విచారణ నిర్వహించి, ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరింది. అనంతరం ప్రభుత్వం మొత్తం ఐదు సార్లు కమిషన్ గడువు పొడిగించింది. రాజమహేంద్రవరంలో మొత్తం పదకొండు సార్లు కమిషన్ విచారణ నిర్వహించింది. 2017 నవంబర్‌లో కమిషన్ చివరి విచారణ ముగించింది. ప్రభుత్వం తరపున న్యాయవాది చింతపల్లి ప్రభాకర్, బాధితుల తరపున భారత న్యాయవాదుల సంఘం సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు వాదనలు విన్పించారు. న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు వివిధ డాక్యుమెంట్లను కమిషన్‌కు సమర్పించారు. సీపీ ఎం, సీపీ ఎం, ఆర్పీసీ, వైసీపీ, న్యాయవాదులు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు సాక్ష్యాధారాలు సమర్పించారు. కమిషన్ సహాయకులుగా సీనియర్ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. దేశవ్యాప్త సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటనలో కంటికి కనిపించేలా పలు లోపాలున్నాయని కమిషన్ ముందు పలువురు నేతలు వాదన వినిపించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటారని మృతుల కుటుంబాలు భావించాయి. అయితే చివరకు ఏ విధమైన చర్య తీసుకోవడాని వీలులేని భక్తులను, మీడియాను దుర్ఘటనకు బాధ్యులుగా పేర్కొనడానికి వారంతా తప్పుపడుతున్నారు.
తప్పంతా మీడియాదేనని అనడం సరికాదని, తప్పంతా ప్రచారం చేసిన ప్రభుత్వానిదేనని సీపీఎం ఇల్లా కార్యదర్శి టి అరుణ్ ఆరోపించారు. ఇది కమిషన్ నివేదికలా లేదని, ముఖ్యమంత్రి నివేదికలా ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన విచారణలా ఉందన్నారు. మూడు సంవత్సరాల రెండు నెలల పాటు సుధీర్ఘ విచారణ అయినపుడే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా, తప్పంతా ఎవరిమీదో నెట్టేయడానికేనని ప్రజలందరికీ అర్ధమైందని అన్నారు. ఇటువంటి నివేదికల వల్ల కమిషన్ అంటే ప్రజలకు నమ్మకం పోతుందని అరుణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ముందుగా తమకు అనుకూలంగా రాసుకున్న నివేదికే అన్నట్టుగా వుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. మీడియా విస్తృత ప్రచారం కల్పించడం వల్లే ఇలా జరిగిందని, ప్రజలది మూఢ నమ్మకం అనడం హేతుబద్ధంగా లేదని ఆరోపించారు.

సముద్రతీర పర్యాటకాన్ని ప్రోత్సాహించాలి
* కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ, సెప్టెంబర్ 19: జిల్లాలో పర్యాటక రంగంలో భాగంగా తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పర్యావరణ అభివృద్ధి మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోస్తా తీర ప్రాంతంలో ఉన్న దీవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అమలైన పర్యాటక వసతులను పరిశీలించటానికి జిల్లా నుండి కొంతమంది అధికారులను పంపనున్నట్లు చెప్పారు. ఈ నెల 24న భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు తిరుపతి నుండి కాకినాడ రిసార్ట్స్ ప్రారంభిస్తారని, అదే విధంగా పాశర్లపూడి, ఓదుర్రులలో ఏర్పాటు చేసిన వౌళిక సదుపాయాలను కూడా వెంకయ్య ప్రారంభిస్తారన్నారు. బీచ్ రిసార్ట్స్‌ను ప్రతీ రోజు సాయంత్రం 5 నుండి 8.30 వరకు తెరిచి ఉంచాలని, 6.30 నుండి 7.30 వరకు లేజర్‌షోను ఏర్పాటు చేయాలన్నారు. బీచ్‌లో పనులన్నీ 22వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. కోరంగి అభియారణ్యంలో మరో సీడ్‌బోటు రెండు రోజుల్లో రానున్నట్లు కలెక్టర్ చెప్పారు.

ఇలాంటి నివేదిక ముందే ఊహించాను
* మాజీ ఎంపీ ఉండవల్లి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇలాంటి నివేదిక ఇస్తుందని ముందే ఊహించానని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. సోమయాజులు కమిషన్ నివేదికపై ఆయన బుధవారం స్పందిస్తూ ఈనివేదికను చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు అనుకూలంగా అల్లుకున్నట్లు ఉందన్నారు. దుర్ఘటన జరిగిన రోజు తానే పుష్కరాలరేవు వద్ద ఉండి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, అయితే నివేదికలో మాత్రం ఆయన వెళ్లిన తరువాత తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం భిన్నవాదనలకు తావిస్తోందని విమర్శించారు. నివేదిక ద్వారా సూచనలు చేస్తుందని ఆశించానని, అయితే అలాంటి సూచనలు చేయకపోవడం శోచనీయమన్నారు.