తూర్పుగోదావరి

ప్రతీ పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, సెప్టెంబర్ 20: ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు కావాలని, పొందిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. గురువారం ఎర్రంపాలెం గిరిజన గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామదర్శిని - గ్రామ వికాస్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో ఆయన గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు తమ భూ రికార్డులు భద్రపరచుకోవాలన్నారు. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికే గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో వౌలిక సౌకర్యాలు, పథకాల అమలు పరిశీలించి గ్రామదర్శిని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. ఈ సందర్భంగా పది మందికి కులధ్రువీకరణ పత్రాలు, పదిమందికి ఓటరు కార్డులు పంపిణీ చేశారు. తహసీల్దార్ చిన్నారావు, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్‌ఐ చిరంజీవిబాబు, ఎంఈఓ మల్లేశ్వరరావు, వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు.
రామచంద్రపురం: బూత్ లెవెల్ అధికారులు కచ్ఛితమైన వేళల్లో ఓటరు జాబితాకు దూరమైన అర్హులైన ఓటర్లను నమోదు చేసుకునే కార్యక్రమంలో పూర్తిస్థాయి కృషి జరగాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ రాజశేఖర్ స్పష్టం చేశారు. కె గంగవరం మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆ మండల పరిధిలోని బూత్ లెవెల్ అధికారులతో సమావేశాన్ని తహసీల్దారు మహ్మద్ యార్ఖాన్ ఏర్పాటు చేయగా ఆ విషయంపై ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజశేఖర్ బిఎల్‌వోలకు దశాదిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే బిఎల్‌వోలందరూ విద్యా సంస్థలకు వెళ్లి అక్కడ విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన వారుంటే ఆ విద్యార్థులను ఓటరు జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా గ్రామంలో చనిపోయిన, వలస వెళ్లిన వారి పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సి ఉందన్నారు. కొంతమంది అద్దెకు ఉంటూ ఇళ్లు మారుతూ ఉంటారని, అటువంటి వారిని గుర్తించి, వారి ఓటుహక్కు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన వారిని చేర్పించే అంశంలో ఎటువంటి పక్షపాతం చూపించ వద్దని బిఎల్‌వోలను ఆర్డీవో రాజశేఖర్ ఆదేశించారు.
అమలాపురం: ఓటర్ల నమోదు కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీవో బి వెంకటరమణ కోరారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఆర్డీవో ఓటర్ల నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు బి బేబీజ్ఞానాంబ, వి సత్యవతి, రాజకీయ పార్టీ నాయకులు తిక్కిరెడ్డి నేతాజీ, మల్లుల పోలయ్య, ఎస్ దినేష్‌బాబు, మట్టపర్తి నాగేంద్ర, బద్రి బాబ్జీ, దేవీ సురేష్‌బాబు, కుడుపూడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.