తూర్పుగోదావరి

ఏజెన్సీలో విస్తృతంగా తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డతీగల, సెప్టెంబర్ 23:విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సోముని మావోయిస్టులు ఆదివారం కాల్చి చంపిన నేపధ్యంలో తూర్పు మన్యం ఉలిక్కిపడింది. ఈ సంఘటనతో తూర్పు మన్యంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అడ్డతీగలలో సీతపల్లి జంక్షన్ వద్ద ఎస్‌ఐ గణేష్‌కుమార్, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్థానిక పోలీసులతో కలిసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రికార్డులను పరిశీలించి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. అడ్డతీగల నుంచి ఏలేశ్వరం, ఏలేశ్వరం నుంచి అడ్డతీగల, గంగవరం, వైరామవరం వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారికావడంతో ఈ ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘాను పటిష్టం చేశారు. అలాగే రంపచోడవరం వెళ్లడానికి ఇటు రాజఒమ్మంగి మీదుగా విశాఖ జిల్లాలో ప్రవేశించడానికి ఈ రహదారి మీదుగానే ప్రయాణించాల్సి ఉంది. ప్రతీ వాహనచోదకుడి రికార్డులను పరిశీలించి సంతృప్తి చెందిన తరువాత మాత్రమే పంపిస్తున్నారు. అడ్డతీగలలో సీతపల్లి సెంటర్‌కు సమీపంలోనే రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నివాసం ఉంటున్నందున కూడా ఈ ప్రాంతంలో నిఘాను పటిష్టం చేశారు. మావోయిస్టుల హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రజా రక్షణ దృష్ట్యా తనిఖీలతో పాటు ఇతర భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్తున్నారు.

ఆర్టీసీ రాత్రి సర్వీసులు రద్దు
రాజవొమ్మంగి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు ఆదివారం హత్య చేయడం, అనంతరం పోలీస్టేషన్లపై గిరిజనుల దాడి చేసిన సంఘటనలు పురస్కరించుకుని రాజవొమ్మంగి పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజవొమ్మంగి ప్రధాన వీధుల్లోసాయుధ బలగాలను మోహరించారు. స్థానిక ఆర్ అండ్‌బి వసతి గృహం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఏలేశ్వరం, గోకవరం డిపోలనుండి రాత్రి సమయంలో మన్యంలో సంచరించే పలు ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును అధికారుల ఆదేశాల మేరకు ప్రయాణీకులను రాజవొమ్మంగిలో బలవంతంగా దింపివేసి తిరిగి ఏలేశ్వరం వెళ్లిపోయింది. దీనితో నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రేవళ్ల, మంప , కొయ్యూరు వెళ్లాల్సిన నైట్ హాల్ట్ బస్సులను రద్దు చేశారు.
చింతూరు: కొన్ని రోజుల నుండి స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పాయింట్ బ్లాకులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తివేరి సోమాను మావోయిస్టులు కాల్చి చంపడంతో తూర్పు మన్యం ఉలిక్కిపడింది. ఏజన్సీలో హై అలర్ట్ ప్రకటించడంతో పోలీసు బలగాలు కూంబింగ్‌లు, తనిఖీలు ముమ్మరం చేశాయి. వాహనాలు, అనుమానితులను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే కిడారిని, సోమాను హత్య చేసేందుకు పాల్గొన్న మావోయిస్టులంతా యువత అని తెలిసింది. మావోయిస్టులు కార్యకలాపాలను విస్తరించేందుకు ఏజన్సీ యువతను వారివైపు ఆకర్షిస్తున్నట్టు తెలిసింది. యువత మావోయిస్టు కార్యకలాపాల వైపు అడుగులు వేస్తే ఏజన్సీలో మావోయిస్టుల బలం రెట్టింపు అవుతుందనడంలో అతిశయోక్తి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌పై అసత్య ఆరోపణలు తగదు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: దేశంలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నారని డిఎల్‌ఓ డిహెచ్‌వి సాంబశివరావు, కాకినాడ, రాజమహేంద్రవరం ఎంసిఎల్‌ఒలు కళ్యాణి, భమిడిపల్లి రమణమూర్తి తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కలగ ప్రభాకర్, మరికొందరు వ్యక్తులు కార్పొరేషన్‌పై చేసిన ఆరోపణలను ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో ఖండించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అర్హులైన ప్రతీ ఒక్కరికి కార్పొరేషన్ ద్వారా పధకాలు అందిస్తున్నామన్నారు. ప్రతీ కులంలోనూ పదుల సంఖ్యలో సంఘాలుంటాయని, అలాగే బ్రాహ్మణ వర్గంలోనూ పలు సంఘాలున్నాయన్నారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను రాజమహేంద్రవరంలో జగన్‌కు తాకట్టు పెట్టబోయి భంగపడ్డ ఆ నాయకులు ఇప్పుడు కార్పొరేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సంఘాలకు అతీతంగా కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఒక వైపు బ్రాహ్మణుల అభ్యున్నతి, మరో వైపు తెలుగుదేశం అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారన్నారు. క్రెడిట్ సొసైటీ తరపున ఇస్తున్న గ్రూపు రుణాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలన చేసి, అర్హులకు ఫలితాలందిస్తోందన్నారు. ప్రభుత్వమిచ్చే ప్రతీ పైసా లబ్ధిదారులకు అందేలా చేస్తున్న ఛైర్మన్‌కు మద్దతు పలకడంపోయి తప్పుడు ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబన్నారు. వేమూరి ఆనంద సూర్య పేరెత్తే అర్హత కూడా రాజమహేంద్రవరం ఎస్‌ఎస్‌ఎస్ నాయకులకు లేదన్నారు. సమావేశంలో నాయకులు మాదిరాజు శ్రీనివాస్, వైవి జగన్నాధరావు, అల్లంరాజు సత్యనారాయణ, గుడిపాటి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.