తూర్పుగోదావరి

ఏవోబీలో కూంబింగ్‌కు భారీ ఎత్తున పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై రామవరం, సెప్టెంబర్ 23: సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన సంఘటనతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమతమైంది. ఏవోబీలో భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములను మవోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే మావోలు అక్కడ నుంచి తూర్పు సరిహద్దు ప్రాంతానికి రావచ్చుననే అనుమానంతో ఈ కూంబింగ్ ప్రారంభించినట్టు సమాచారం. ఒకవైపు నుంచి విశాఖ, మరోవైపు నుంచి తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కూంబింగ్ ప్రారంభించి మావోల కోసం ఏవోబీను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగా ఆదివారం సాయంత్రం వై.రామవరం మండలం మీదుగా భారీ ఎత్తున ఏఎన్‌ఎస్, గ్రేహాండ్స్, సీఆర్పీఎఫ్ పోలీసు బలగాలు ఏవోబీలోకి ప్రవేశించాయి.

బూరుగుపల్లిలో రెండునెలల మగబిడ్డ మృతి
మండలంలో 14కు చేరిన శిశుమరణాలు
రాజవొమ్మంగి, సెప్టెంబర్ 23: మండలంలో బూరుగుపల్లి గ్రామానికి చెందిన కోసూరి వెంకటలక్ష్మి అనే గిరిజన మహిళలకు తొలి కాన్పులో జన్మించిన రెండునెలల మగబిడ్డ కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. బూరుగుపల్లి గ్రామంలో శనివారం ఆబిడ్డకు తీవ్రమైన జ్వరం వచ్చి వాంతులై కళ్లు తేలేయడంతో హుటా హుటిన తల్లి స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వైద్యశిబిరానికి తీసుకొచ్చింది. ఆందోళనకరంగా ఉన్న ఆ బిడ్డకు వైద్య పరీక్షలు చేయడానికి మూడు గంటలు సమయం తీసుకోవడం, అంబులెన్సులో కాకినాడ తరలించేందుకు మరో మూడు గంటలు సమయం అవ్వడంతో బిడ్డ పరిస్థితి మరింత క్షీణించింది. కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బిడ్డ కన్నుమూసింది. రాజవొమ్మంగి వచ్చిన వెంటనే అబిడ్డకు వైద్య సహాయం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బిడ్డకుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిడ్డ మరణంతో మండలంలో ఈ ఏడాది అనారోగ్యంతో మరణించిన శిశువుల సంఖ్య 14కి చేరింది. మన్యంలో బిడ్డలకు సరైన వైద్య సహాయం అందక పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడని సర్వత్రా నిరసన వ్యక్త మవుతోంది. అష్టకష్టాలు పడి నవమాసాలు మోసి కని పెంచుతున్న బిడ్డలు తమ కళ్లెదుటే అసువులుబాయడంతో తల్లులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ముక్కు పచ్చలారని పసిమొగ్గలు ప్రపంచాన్ని చూడకుండానే పొత్తిళ్లలోనే అనారోగ్యానికి గురవ్వడం, సరైన వైద్య సహాయం అభించకపోడం గిరిజన గ్రామాల్లో జరుగుతుంది. ఎన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం కనిపించడంలేదు. శిశువైద్య నిపుణులను, గైనకాలజిస్టులను ఏజెన్సీ ఆసుపత్రుల్లో నియమిస్తామని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటల్లో వాస్తవం కనిపించడంలేదు. ఈ నియామకాలు జరిగి ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్యం అందితేనే మరణాలు తగ్గుతాయని చెప్పవచ్చు.