తూర్పుగోదావరి

మన్యంలో రెడ్ అలర్ట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: విశాఖ మన్యం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరు సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లా మన్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనతో తూర్పు మన్యంలో పెద్ద ఎత్తున కూంబింగ్ ముమ్మరం చేశారు. మన్యం ప్రజా ప్రతినిధులకు పూర్తి రక్షణ కల్పించాలని హోం మంత్రి చిన రాజప్ప ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతోన్న టీడీపీ గ్రామ దర్శిని కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ దర్శినికి వెళ్తున్న టీడీపీ ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని రంపచోడవరం పోలీసు అధికారులు చెప్పారు. మన్యంలోని అన్ని మండలాల్లోనూ వాహనాల తనిఖీ చేస్తున్నారు. స్పెషల్ ఫోర్స్‌ను మన్యంలో కూంబింగ్ కోసం దింపారు. ఆదివారం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.
విశాఖ, తూర్పు, ఖమ్మం జిల్లాలను పోలీసులు చుట్టు ముట్టారు. సుమారు మూడు దశాబ్ధాల క్రితం అడ్డతీగల ఎంపీపీ అనంత చక్రరావును నక్సలైట్లు కాల్చి చంపిన ఘటన జరిగింది. ఆ తర్వాత అనేక దాడులు జరిగినప్పటికీ ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులపై హత్యాయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. గతంలో వై రామవరం మండలం జంగాలతోట గ్రామం నడిబొడ్డున మాజీ దళ కమాండర్ మువ్వల నరేష్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. 2001లో వై రామవరం మండలంలో సింగవరం కల్వర్టు వద్ద మావోయిస్టులు బాంబు పేల్చిన సంఘటనలో గ్రేహౌండ్స్ ఎస్‌ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్ళు మృతి చెందారు. 2007లో వై రామవరం మండలం జంగాలతోట వద్ద పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో ఊనెం రాంబాబును మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత 2011లో వై రామవరం మండలం పాతకోట వద్ద పాలగడ్డ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు జేబీసీని తగుల బెట్టి నిరసన వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పలకజీడిలో ఈవీఎంలు, జీపులను తగులబెట్టారు. ఏదేమైనప్పటికీ మన్యం భయం గుప్పెట ఆందోళనకరంగా వుంది.

చాలా దురదృష్టకరఘటన: చినరాజప్ప
సామర్లకోట, సెప్టెంబర్ 23: విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు కాల్చి చంపడం దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల కాల్పులు సంఘటనపై ఆదివారం సాయంత్రం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని మంత్రి రాజప్ప తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఎటువంటి సంఘటనలు జరగలేదని, గ్రామ దర్శిని కార్యక్రమానికి వెడుతున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు మాటువేసి హతమార్చడం దురదృష్టకరం అన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, అధికారుల బృందం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జరిగిన సంఘటనపై ప్రభుత్వం హుటాహుటిన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. చత్తీష్‌గఢ్, ఒడిస్సా, తెలంగాణాలో మావోయిస్టుల సమస్యలు అధికంగా ఉన్నా గత నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో ఎటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో చోటుచేసుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు ఎవరు వచ్చారు?, కాల్పులు ఎలా జరిపారో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ స్వేచ్ఛ ఉందని, జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లో మంత్రి రాజప్ప మాట్లాడారు. గ్రామ దర్శనిలో పాల్గొంటున్న ప్రజా ప్రతినిధులకు కల్పించే రక్షణ చర్యల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. హోం మంత్రి రాజప్ప విశాఖపట్నం జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రి కూడా. దాంతో హుటాహుటిన మంత్రి రాజప్ప అచ్చంపేట నుంచి విశాఖపట్నం పయనమయ్యారు.