తూర్పుగోదావరి

పల్లెలకు విద్యుత్ కల్పనలో ఏపీఈపీడీసీఎల్ మొందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, సెప్టెంబర్ 25: పల్లె ప్రాంతాల్లో నూరుశాతం విద్యుద్దీకరణతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సీహెచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం రాయవరం మండలంలోని వెంటూరు గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లల్లో 550 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం, అంతర్గత లైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. గత ఐదారునెలల్లో పలు గ్రామాల్లో విద్యుత్ నిర్మాణ లైన్ల పనులు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఎక్కడాలేవని, విద్యుత్ వినియోగం పెరిగిన ప్రాంతాల్లో ఎక్కడైనా లోవోల్టేజీ సమస్య ఉంటే వెంటనే వాటిని సరిదిద్దేందుకు ఆయా సామాగ్రిని తక్షణమే సరఫరా చేస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు పథకం దీనదయాళ్ ఉపాధ్యాయ, గ్రామజ్యోతి యోజన, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ప్రపంచ బ్యాంకు పథకంలో భాగంగా కాకినాడలో 3, రాజమహేంద్రవరం, తునిలో ఐదు నూతన్ సబ్‌స్టేషన్లకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. సుమారు 250 వరకు లైన్‌మేన్ల కొరత ఉందని, అయితే వీరి భర్తీకి ప్రనుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఏడుగంటలపాటు రైతులకు నిరంతర విద్యుత్ అందజేస్తున్నట్టు ఎస్‌ఈ తెలిపారు.

కాపులను మోసం చేసే వారిని వథిలిపెట్టేది లేదు.
ప్రత్తిపాడు, సెప్టెంబర్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని కాపులను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాయని, ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు రాష్ట్రంలోని బలిజ, ఒంటరి, తెలగ, కాపులు స్పందించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు జేఏసీ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో మంగళవారం ఏడు జిల్లాల కాపు జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 13 జిల్లాల కాపు జేఏసీ నాయకుల సూచనలు, సలహాల మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై ముద్రగడ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, ముద్రగడ తీసుకునే నిర్ణయం మేరకు తామంత నడుచుకుంటామని సమావేశంలో కాపు నాయకులు అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను ముద్రగడ ప్రకటిస్తారని కాపు జేఏసీ నాయకులు మంగళవారం సాయంత్రం మీడియాకు చెప్పారు. 2014 ఎన్నికల్లో కాపుల ఇంటింటికీ చంద్రబాబునాయుడు తిరిగి తనను గెలిపించాలని గతంలో కాపులు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్‌ను తాను తిరిగి ఇస్తానని ఇచ్చిన హామీని జాతి నమ్మి చంద్రబాబును కుర్చిలో కూర్చోబెట్టిందని వారు సమావేశంలో అన్నారు. గత మూడున్నరేళ్లుగా జాతి రోడ్డెక్కి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయమని, రోడ్డెక్కితే జాతిని చంద్రబాబు అవమానం పాల్జేసి తప్పుడు కేసులు బనాయించాలని అన్నారు. తమను మోసం చేసిన పార్టీకి తగిన బుద్ధి చెప్పిన అవసరం ఉందని పలు జిల్లాల కాపు నాయకులు ఈ సభలో తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సభకు తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడతోపాటు ఉత్తరాంధ్రాకు చెందిన ఏడు జిల్లాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో తోట రాజీవ్, చిన్నపిల్లి వెంకటరాయుడు, సూర్యప్రకాశరావు, పడాల మాధవరావు, నరాలశెట్టి నరసింహరావు, మిరియాల శ్రీనివాసరావు, ఆకుల రామకృష్ట, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, పవన్, తుమ్మలపల్లి రమేష్, గౌతు స్వామి, పలువురు మహిళా కాపు జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.