తూర్పుగోదావరి

ప్రజా విశ్వాసం కోల్పోయన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్పవరం జంక్షన్, సెప్టెంబర్ 25: టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ఆ పార్టీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లి, వైసీపీ అధినేత జగన్‌కు ప్రజాదరణ లభిస్తోందని సినీ నటుడు, వైసీపీ నేత పృధ్వీరాజ్ పేర్కొన్నారు. మంగళవారం సర్పవరం జంక్షన్లో వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో పృధ్వీరాజ్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 3వేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా పృధ్వీరాజ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. వైసీపీలో 2012నుంచి కేవలం జెండా మోసే కార్యకర్తగా తాను సేవలందజేశానన్నారు. నాటి వైఎస్సార్ పాదయాత్ర నుంచి నేటి జగన్ పాదయాత్రకు కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. ఢిల్లీలో అమ్‌అద్మీ పార్టీ గెలిచినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి మంచి ఆదరణ కనిపిస్తోందని, ఇక్కడ అభ్యర్థి కన్నబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ నేత కురసాల కన్నబాబు మాట్లాడుతూ జగన్ 3వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేసిన సందర్భంగా నియోజకవర్గంలో మూడు రోజులపాటు పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. నవరత్నాలు పథకాలను గూర్చి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్ చేపట్టిన పాదయాత్ర మరువరానిదని అన్నారు. జిల్లాలో 40 రోజులపాటు జగన్ పాదయాత్ర షెడ్యూల్ ఉన్నా 63 రోజులపాటు కొనసాగిందని దీనికి ప్రజల అభిమానమే కారణమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కన్నబాబు పిలుపునిచ్చారు. అనంతరం సర్పవరం జంక్షన్ నుంచి పాదయాత్రగా కైగలపాడు, 49, 50 డివిజన్ల మీదుగా పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో వైసీపీ నేతలు కురసాల సత్యనారాయణ, కాకినాడ రూరల్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నులుకుర్తి రామకృష్ణ, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగలక్ష్మి, నాగమణి, కరప మండల పార్టీ అధ్యక్షుడు కె సీతారామాంజనేయులు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి లింగం రవి, గీసాల శ్రీనివాస్, అల్లి రాజబాబు, రాజారపు వెంకటలక్ష్మి, పుల్లా కోటేశ్వరరావు, రొంగల వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి సూరిబాబు, కోరాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంలో భారీ వర్షం

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: రాజమహేంద్రవరం ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కుండపోతగా సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమమమయ్యాయి. వేగంగా, దట్టంగా కురుసిన వర్షానికి రోడ్లు సైతం జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పగలంతా తీక్షణమైన ఎండ తీవ్రంగా కాచింది. ఆపై సాయంత్రానికి వాతావరణం చల్లబడి దట్టమైన మేఘావృతమై చీకట్లు కమ్మాయి. ఆపై భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. కోరుకొండ రోడ్డులో వర్షపునీరు కాల్వ మాదిరిగా కన్పించింది. కారల్ మార్క్స్ రోడ్డు, విఎల్ పురం జంక్షన్, మోరంపూడి ఎల్‌ఐసీ ఆఫీసు రోడ్డు, తాడితోట బైపాస్ రోడ్డు జంక్షన్, వై జంక్షన్, కంబాలచెరువు డౌన్, ఆర్యాపురం మధ్య వీధి, లలితానగర్, రైల్వే స్టేషన్ రోడ్డు, ఏవీఎ రోడ్డు, ఎస్వీ మార్కెట్, వెంకటేశ్వరనగర్, శేషయ్య మెట్ట, దానవాయిపేట తదితర ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. వర్షం తెరిపి ఇచ్చిన కొద్ది సేపటికి నీరంతా లాగేయడంతో తారురోడ్లన్నీ మట్టికొట్టుకుపోయి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది. నగరంలోని పలు డివిజన్లలో చాలా చోట్ల భారీ కల్వర్టులు, డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోంది. ఇటువంటి చోట్లంతా నీరు భారీగా నిలిచిపోయింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్ధంభించింది. రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.