క్రైమ్/లీగల్

డెంగ్యూతో బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: డెంగ్యూ వ్యాధితో బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం రాజమహేంద్రవరంలో జరిగింది. సీనియర్ ఫొటోగ్రాఫర్ ఆర్‌వివి సత్యనారాయణ పెద్దకుమారుడు శ్రీనివాస్(18) డెంగ్యూవ్యాధితో ఆర్యాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్‌ను వారంరోజుల క్రితం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా, పరీక్షలు నిర్వహించి, డెంగ్యూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు సంతాపం ప్రకటించారు. సత్యనారాయణకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. కాగా, డెంగ్యూవ్యాధి బారినపడి నగరానికి చెందిన బాలుడు మృతి చెందడంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. విషజ్వరాల బారినపడి పెద్దసంఖ్యలో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు సమ్మెతో వ్యాధుల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పిచ్చికుక్క స్వైరవిహారం
15 మందికి గాయాలు
మండపేట, అక్టోబర్ 13: గత రాత్రి నుంచి పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ కుక్కను మున్సిపల్ సిబ్బంది పట్టుకుని దూరంగా తరలించటంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం రాత్రి స్థానిక సూర్య కన్సనె్షన్ హాలులో నిర్వహించిన ఒక వివాహ వేడుకకు హాజరైన పలువురిపై ఈ కుక్కదాడి చేసి, అక్కడ నుంచి పట్టణంలో తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేసింది. ఒక్క శుక్రవారం రాత్రే 15 మందిని గాయపర్చినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానిక గొల్లపుంత కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు వారా కామేశ్వరి ఇంటి నుంచి పట్టణానికి నడిచి వస్తుండగా ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఈమెపై దాడిచేసింది. కాలిపై బలంగా కరిచింది. ఆమె విధిలించుకునే లోపే చేతిని కూడా కరిచింది. బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమెకు వైద్యం అందజేసిన వైద్యులు ఆమెతోపాటు మరో ముగ్గుర్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లమని సూచించారు. ఇదిలా ఉండగా..గత రాత్రి నుంచీ మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్ తన సిబ్బందితో కలిసి పిచ్చికుక్క కోసం పట్టణంలో తీవ్రంగా గాలించారు. చివరికి ఆ కుక్కను సిబ్బంది బంధించి దూర ప్రాంతంలో విడిచిపెట్టారు.