తూర్పుగోదావరి

థాన్యం కొనుగోలులో కొత్త మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, నవంబర్ 16: తొలకరి ధాన్యం ఖరీదులో ప్రభుత్వాధికారులు సరికొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టడంతో మిల్లర్లు ఖరీదులు నిలుపుదల చేయడంతో రైతులు మాసూళ్లు చేసిన ధాన్యం వారం రోజులగా కంగారు పెడుతున్న వరణుడికి దొరక్కుండా ఎక్కడ దాచిపెట్టాలని రైతులు ఇబ్బందులు పెడుతున్నారు. సాపీగా మాసూళ్ళు జరుగుతుంటే మిల్లర్లు మద్దతు ధరకు యాభై రూపాయలు అటుఇటుగా ఖరీదు చేస్తున్నారు. మొన్నటి వరకూ సాగిన ఖరీదులను ఒక్కసారిగా మిల్లర్లు మంగళవారం నుంచి నిలుపుదల చేసారు. మాసూళ్ళు చేయకుండా పనతో చేలోనే ఉంచితే ముసురుకున్న తుపాను ముప్పుతో పూర్తిగా నష్టపోతామన్న భయంతో రైతులు నూర్పిడులు చేస్తున్నారు. మాసూళ్ళు చేసిన ధాన్యం ఎవరూ కొనకపోవడంతో ఏమిచేయాలో తెలియక అయోమయంలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి వరకూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా మిల్లుల వద్దకు వెళ్లి నుడస్తున్న ధరకు అమ్ముకునేవాడు. అమ్ముకున్న రైతు బ్యాంకు అకౌంటు, పాస్‌పుస్తకం జిరాక్సు మిల్లర్స్‌కు ఇస్తే రెండు మూడు రోజలు వ్యవధిలో ఖాతాకు డబ్బులు వచ్చేవి. మిల్లర్లు రైతులు ఇచ్చిన కాగితాలను అందుబాటులో ఉన్న కొనుగోలు కేంద్రాలలో నమోదు చేయించి అవసరమైన తంతును నడిపేవారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ పరిస్థితులను పరిశీలించి కొన్ని మార్గదర్శకాలను ప్రవేశ పెట్టారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఉద్యోగికి ఒక ట్యాబ్‌ను ఇచ్చారు.ఆ ఉద్యోగి అమ్మకానికి వచ్చిన రైతుతో పాటు కళ్లెంలోకి వెళ్ళి ధాన్యం రాశి వద్ద రైతును నిలబెట్టి కూడా తీసుకెళ్ళిన జట్టుతో ధాన్యం పట్టించి భూమి వివరాలను ట్యాబ్‌లో నిక్షిప్తం చేసిన తరువాత మిల్లులకు తరలించాలని నిబంధన పెట్టడంతో మిల్లర్లు ఖరీదులు నిలుపుదల చేశారు. ఈ విధానం ద్వారా ఎంతో ధాన్యం ఖరీదు చేయలేమని, ఉద్యోగి జట్టును ఏలా సమీకరిస్తారని, ఒక ఉద్యోగి వల్ల ఇది ఎంత మాత్రం సాధ్యం కాదని రైతలు చెబుతున్నారు. మండలలోని సుమారు సుమారు పదివేల ఎకరాలలో పంటను సమీకరించాలంటే ఎంత సమయం పడుతుందో ఉన్నతాధికారులకు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ఈ విధానం క్షేత్రస్థాయిలో కుదరదని అటు మిల్లర్లు, ఇటు రైతు ప్రతినిధులు చెప్పినా జేసీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పడంతో మిల్లర్లు నేరుగా రైతు నుంచి ఒక్క గింజ కూడా కొనకుండా మిన్నకున్నారు. దీనితో రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. తమిళనాడు వద్ద ఏర్పడిన తుపాను కారణంగా గంటకో తీరుగా ఆకాశంలో మార్పులు ఒక పక్కైతే పండించిన ధాన్యం మిల్లర్లు ఖరీదు చేయడం లేదన్న విషయం మరోపక్క రైతును ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజులుగా అనపర్తి, బిక్కవోలు, రాయవరం, మండపేట మండలాలకు సంబంధించి రైతులకు కంటిమీద కునుకు లేదనే చెప్పాలి. మాసూళ్ళ చేసిన దాన్యాన్ని గుడి అరుగుల, కమ్యూనిటీ హాళ్లు, కచేరీ చావడి వద్ద నిల్వ చేసుకుని వాటి వద్ద కాపలా కాసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. అనపర్తి మండలానికి ఆరు కొనుగోళ్ళు కేంద్రాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటికి మూడు కేంద్రాలను ప్రారంబించారు. అనపర్తి, పొలమూరులలో సొసైటీల వద్ద, మహేంద్రవాడలో వెలుగు ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకుండా ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేస్తే క్షేత్రస్థాయిలో అమలుకు ఇబ్బందులు ఉంటాయని, వాతావరణం అనుకూలించకపోతే ఈ నిర్ణయాల వలన వేలాది బస్తాల ధాన్యం కళ్లాలలోనే ఉండిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే ఉన్నతాధికారులు పరిస్థితులను సమీకరించి రైతులకు యాతన లేని విధంగా ధాన్యం ఖరీదు చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఏఓబీలో మళ్లీ మావోయిస్టు పోస్టర్ల కలకలం
సరిహథ్దులో వెలసిన మావోయిస్టు పోస్టర్లు
వై రామవరం, నవంబర్ 16 : మన్యంలో(ఏఓబీలో) పోస్టర్ల కలకలం చెలరేగింది. గత నెల 12న తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖజిల్లా కొయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయితీ పలకజీడి గ్రామంలో మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఒక హెచ్చరిక పోస్టరు వెలసిన విషయం విదితమే. అయితే తిరిగి శుక్రవారం అదే గ్రామ శివారులో మావోయిస్టు ఎంకేవీబి డివిజన్ కమిటీ పేరుమీద కొన్ని డిమాండ్లతో కూడిన పోస్టర్లు చింత చెట్టుకు అతికించి దర్శనవిచ్చాయి. శుక్రవారం ఆ గ్రామంలో వారపుసంత కావడంతో వాటిని చూసిన వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. గతనెలలో, ఈ నెలలో రెండుసార్లు కూడా వారపుసంత రోజు శుక్రవారమే పోస్టర్లు దర్శనమివ్వడంతో వ్యాపారులు భయాందోలనకు గురవుతున్నారు. చింత చెట్టుకు అతికించిన ఆపోస్టర్ల ద్వారా బాక్సైటు, కాఫీతోటల సమస్యలు తదితర డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 ఎన్నికల హామీలతో ప్రజలను అనేక విధాలుగా మోసగించాయని దుయ్యబట్టారు.