తూర్పుగోదావరి

రైతుల్ని భయపెడుతున్న గజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, నవంబర్ 16: గజ తుఫాను ప్రభావంతో ఎక్కడ వర్షాలు పడతాయోనని రైతులు అల్లాడిపోతున్నారు. ఆకాశంలో దట్టమైన మబ్బులు, ఈదురుగాలులు వేయడంతో బెంబేలెత్తిపోతున్నారు. రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసిన వరి రకాలు 1001,1010,1156( అంజలి),1064 ముందుగానే పక్వానికి వచ్చేసాయి. వరి కంకులు పండిపోడంతో తుఫానుతో ఎక్కడ రాలిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పలరాజపేట, రాజవొమ్మంగి, దూసరపాము గ్రామాల్లో కొంత మంది రైతులు తెగించి కోతలు కూడ కోసేసారు. కోసిన వరి పనలను ఆరకుండానే మిషన్లతో నూర్పించడానికి సిద్ధమవుతున్నారు. అప్పరాజుపేటలో రైతులు శుక్రవారం యుద్ధప్రాతిపదిన నూర్పులు చేపట్టారు. రాజవొమ్మంగి మండలంలో సుమారు 6వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 2వేల ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. అడ్డతీగల, వై రామవరం, గంగవరం మండలంలో కూడ రైతులు ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో రకంగా ఈ తుఫాను బారినుండి గట్టెక్కితే తాము కనీసం పండిన పంటైనా చేతికందుతుందని రైతులు ఆశపడుతున్నారు.