తూర్పుగోదావరి

మోదీ పాలన అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, నవంబర్ 16:ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్ళ పాలన అస్తవ్యస్తంగా సాగిందని, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసారని, దేశంలో కుల, మత ఘర్షణలను ప్రోత్సహించి ఆశాంతికి ఆజ్యం పోస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, ఒడిస్సా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో ప్రణాళికా సంఘం రద్దు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలు దేశానికి, ప్రజలకు మేలు చేయకపోగా మరింతగా ఇబ్బందులను తెచ్చిపెట్టాయని విమర్శించారు. నోట్లు రద్దు ద్వారా మహారాష్టల్రో బీజేపీ నాయకులు నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని గిడుగు స్పష్టం చేసారు. నోట్లు రద్ధు పేరుతో 15.41 లక్షల కోట్లు వెయ్యి, 500ల నోట్లు రద్ధు చేస్తే తిరిగి 15.31 కోట్లు అంటే 99.6 శాతం ధనం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వు బ్యాంకు అధికారులు ప్రకటించారన్నారు. దీన్ని బట్టి నోట్ల రద్దు వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో చెప్పవచ్చన్నారు. కాంగ్రెస్ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీని అమలు చేయాలని నిర్ణయిస్తే, మోదీ ప్రభుత్వం ఒకే దేశం ఐదు రకాల పన్నులను ప్రవేశపెట్టిందన్నారు. జీఎస్టీ వల్ల దేశానికి ఆదాయం పెరగక పోగా మరింతగా తగ్గిపోయిందన్నారు. అలాగే రఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో రూ. 40 లక్షల కోట్లు అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నా ప్రధాని మోదీ కనీసం సమాధానం చెప్పకుండా వౌనం వహించడం అవినీతిని అంగీకరించడమేనన్నారు. రఫెల్ వ్యహహారంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్, మంత్రివర్గ ఆమోదం గాని తీసుకోకుండా మోదీ ఏకపక్షంగా వ్యవహరించి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ప్రయివేటు సంస్థకు దోచిపెట్టారన్నారు. రఫెల్ ఓప్పందం రెండు ప్రభుత్వాలకు మద్య జరిగిందా? లేక రెండు ప్రయివేటు సంస్థల మధ్య జరిగిందా అనే విషయాలను దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేసారు. సీబీఐ దీనిపై స్పందిస్తే ఆ సంస్థలో సైతం అంతర్గత విభేదాలు సృష్టించి దాని పరువుప్రతిష్టలను రోడ్డుకీడ్చారన్నారు. దేశాన్ని కులాలు, మతాల పేరుతో విభజిస్తున్నారని, ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల కర్ణాటక శాసనసభ, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని గిడుగు గుర్తు చేసారు. అలాగే త్వరలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణా, మిజోరాం ఎన్నికల్లో రాహుల్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని గిడుగు ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే జీఎస్టీపై సమీక్ష, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలకు ప్రధాన్యత ఇస్తామన్నారు. అలాగే ఏపీలో వివిధ కార్పొరేషన్‌ల ద్వారా అందించే రుణాలకు సంబంధించి బ్యాంకర్లు ముందుగానే లబ్ధిదారుల నుండి లక్ష రూపాయలు డిపాజిట్ తీసుకుంటున్నారని, దీనిపై సీఎం చంద్రబాబు దృష్టిసారించాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ వైఫల్యాలను తెలియజేసే కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, యార్లగడ్డ రవీంద్ర, చీకట్ల అబ్బాయి, కొత్తూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలి
దేవీపట్నం, నవంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీలో పనులు రాత్రింబవళ్లు చేపట్టి నిర్ణీత సమయానికి పూర్తిచేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్‌కుమార్ గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని ముసళ్లగుంట గ్రామం వద్ద గానుగులగొంది, తొయ్యేరు, మూలపాడు, రంగంపాలెం తదితర గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 314 కుటుంబాలకు పునరావాసం కాలనీలు నిర్మిస్తున్నట్టు పీవో తెలిపారు. ఈ పనులను పీవో శుక్రవారం పరిశీలించారు. పొదల తొలగింపు, నేల చదును, పునాదులు, నిర్మాణ పనులు, గృహాల ఆకృతులు, ఏయే వసతులు కల్పిస్తున్నదీ మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితుల అభీష్టం మేరకు వారికనుగుణంగా వారు ఎంపిక చేసుకున్న ఆకృతులనే ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టాలని పీవో ఆదేశించారు. నిర్మాణ పనులకు సంబంధించి యంత్రాల పరికరాల వినియోగం పెంచాలని, అన్ని పనులు సమాంతరంగా చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో రహదారులు, అనుసంధాన రోడ్లు, టౌన్ ప్లానింగ్ నమూనాలో చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, జీసీసీ రేషన్ డిపో, పోస్ట్ఫాసు తదితర భవన నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో పనులు పూర్తి నాణ్యతతో చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రంగవరం మండలంలో నేలదోనెలపాడు గ్రామంలో దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీ పరిధిలోగల 8 గ్రామాల నిర్వాసితులకు 390 పునరావాస గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీటిని డిసెంబర్ నాటికి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలన్నీ పూర్తిచేసేందుకు నిర్ణయించుకున్నట్టు పీవో నిశాంత్‌కుమార్ తెలిపారు. ఈయన వెంట తహసీల్దార్ ఎస్ సత్యనారాయణమూర్తి, జూనియర్ ఇంజినీర్ వౌనిక, ఆర్‌ఐ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.