తూర్పుగోదావరి

సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 16: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలో భారతీయ జనతాపార్టీని సమాయత్తం చేస్తున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యుడు తోట వెంకట సర్వారాయుడు చెప్పారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ అధినేతలు తనను నమ్మి కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా జిల్లాలో బీజేపీని పటిష్ట పరిచేందుకు కృషిచేస్తానన్నారు. తన తండ్రి, దివంగత పార్లమెంటు సభ్యుడు తోట సుబ్బారావు ప్రజలకు ఎన్నో సేవలందించారని, తనకు వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదని, అయితే దేశ ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న అభిమానంతో తాను 2013లో బీజేపీలో చేరినట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో రాష్ట్రంలో బీజేపీ పటిష్టంగా ఉందని సర్వారాయుడు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రోజుకో యూటర్న్ తీసుకుంటూ రాష్ట్రంలో రాజకీయాలను కలుషితం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగుతున్న అవినీతి, ఇతర విషయాలపై బహిరంగ చర్చకు తాము సిద్దమని, దీనికి టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం కారణంగా టీడీపీ చీలిపోతుందని మాలకొండయ్య జోశ్యం చెప్పారు. సమావేశంలో పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు చిట్నీడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
21న సిఎం చంద్రబాబునాయుడు జగ్గంపేటలో పర్యటన
కలెక్టర్ మిశ్రా
కాకినాడ సిటీ, నవంబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 21న జగ్గంపేట మండలంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు. సిఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ ద్వారా ట్రాక్టర్లు పంపిణీ, పశుసంవర్ధకశాఖ ద్వారా పాడి గేదెలు పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. సిఎం పర్యటించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్-2 వద్ద హెలికాప్టరు ల్యాండింగ్, అక్కడ నుండి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ ప్రదేశం వరకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కల్టెర్ ఆదేశించారు. 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించే సమయం ఇంకా ఖరారు కావలసి ఉందని, జగ్గంపేట సభాస్థలి, డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం, బహిరంగ సభ, యూనిట్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యేలా వారిని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ మిశ్రా ఆదేశించారు.