తూర్పుగోదావరి

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు: జడ్పీ ఛైర్మన్ నవీన్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, డిసెంబర్ 12: జగ్గంపేటలో అర్హులందరికీ ఇళ్లస్థలాలు అందించేందుకు చర్యలు చేపడతామని జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన జగ్గంపేట-పోలవరం కాలువ గట్టున నిర్మించనున్న ఇళ్ల సముదాయానికి భూమిపూజ చేశారు. ఈసందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ 2014వ సంవత్సరం ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలం ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారని, దానిలో భాగంగా ఎక్కడా స్థలం లేని సమయంలో పోలవరం కాలువ గట్టున ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రితోపాటు మంత్రి వర్గం ఆమోదం పొందటం జరిగిందన్నారు. నేడు 39 ఎకరాల భూమిని ఇళ్లస్థలాలుగా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అయితే 39 ఎకరాల్లో భూ పట్టాలు ఇస్తే కేవలం 1300 మందికి మాత్రమే సరిపోతుందని, అలా కాకుండా పెద్దాపురం మండలంలోని వాలు తిమ్మాపురం గ్రామంలో మాదిరిగా జి ప్లస్ 3 మోడల్ గృహాలను నిర్మించి సుమారు 4500 మందికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించి భూమి చదును చేసేందుకు జ్యోతుల నవీన్‌కుమార్ పొక్లయినర్‌ను ప్రారంభించారు.