తూర్పుగోదావరి

యువతే పార్టీకి జవసత్వాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, డిసెంబర్ 12: యువతే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రత్యేకస్థానం ఉంటుందని అటువంటి ప్రత్యేకలు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సత్తి రామకష్ణారెడ్డి (రాంబాబు) పునఃప్రవేశం పార్టీకి జవసత్వాలను ఇస్తుందని ఉభయగోదావరి జిల్లా పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన అనపర్తి తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదికపై జరిగిన రాంబాబు పునఃప్రవేశ కార్యక్రమంతోపాటు సుమారు 500 మంది కార్యకర్తలు పార్టీలో చేరిక కోసం ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అన్యాయాలను, అక్రమాలను ప్రజలు భరించలేకున్నారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. దేశం పార్టీకి, చంద్రబాబు నాయకత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ప్రజా సమస్యలను తెలసుకోవడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేపట్టారని ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్న తీరును దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ప్రజలు పార్టీని, నాయకుడు జగన్మోహనరెడ్డిని ఆశీర్వదించి ముందుకు పంపాలని ఆకాంక్షించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి రాంబాబు లాంటి యువకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. ఇప్పటి వరకూ తటస్ధంగా ఉండి పార్టీకి సేవ చేసేందుకు ముందుకు వచ్చిన రాంబాబు, ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన కార్యకర్తలందరూ అభినందనీయులన్నారు. అనపర్తి నియోజవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజవర్గంలో అవినీతికి, అక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుందని వీటికి మంగళ హారతి పాడే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ప్రభుత్వ అవినీతిని స్వంత పార్టీలోని మండలస్థాయి ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల అవినీతి దందాలు బయటపడే కాలం ఆసన్నమయిందన్నారు. రాజమండ్రి పార్లమెంట్ పార్టీ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే కెనాల్ రోడ్డును అభివృద్ధి చేసి రాజమండ్రి-కాకినాడల మధ్య దూరాలను తగ్గించి ప్రాంతాలను పురోభివృద్ధివైపు నడిపిస్తానన్నారు. సమన్వయ కార్యకర్త వైవీ సుబ్బారెడ్డి పార్టీలోకి పునఃప్రవేశించిన రాంబాబు, ఆయనతోపాటు పార్టీ తీర్ధం పుచ్చుకున్న 500 మంది కార్యకర్తలకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆవ్వానించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ నాయకులు కవురు శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది సత్తిసుబ్బిరెడ్డి, మిండగుదిటి మోహన్, సీనియర్ నాయకులు సత్తి వీర్రెడ్డి, మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణ రెడ్డి, నల్లమిల్లి మరళి మోహన బాలకృష్ణారెడ్డి, అనపర్తి మాజీ ఉపసర్పంచ్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, రంగంపేట, పెదపూడి, బిక్కవోలు మండల కన్వీనర్లు నల్లా శ్రీనివాసరావు, గాజంకి వెంకటరమణ, పోతుల ప్రసాదరెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.