తూర్పుగోదావరి

గొర్రెల మందపై దూసుకెళ్లిన ట్రాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, డిసెంబర్ 12: గొర్రెల మందపై ట్రాక్టరు దూసుకెళ్లిన ప్రమాదంలో 21 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని సోమేశ్వరం శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేట మండలం ఒడిశలేరు గ్రామానికి చెందిన వీరబాబుతోపాటు మరికొందరు నాలుగు మందల గొర్రెలను ఆర్‌అండ్‌బీ రోడ్డుపై సుమారు ఉదయం 5గంటల ప్రాంతంలో లొల్ల గ్రామం వైపు తోలుకెళుతుండగా సోమేశ్వరం వైపు బూడిద లోడుతో వస్తున్న ట్రాక్టరు మందపై నుంచి దూసుకుపోవడంతో ఘటనాస్థలంలో 21 గొర్రెలు చనిపోగా, మరికొన్ని గొర్రెలు గాయపడ్డాయి. ట్రాక్టరు అనపర్తి మండలం పులుగుర్త గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలిసింది. గొర్రెల యజమానికి, ట్రాక్టరు యజమానికి మధ్య పెద్దలు రాజీ కుదిర్చి నష్టపరిహారం ఇప్పించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. కాగా సంఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మూగజీవాలు మరణించడం చూపరులను వేదనకు గురిచేసింది.
కస్టమ్ మిల్లింగ్ బియ్యంను త్వరగా సేకరించాలి: జేసీ మల్లికార్జున
కాకినాడ, డిసెంబర్ 12: ఈ ఖరీఫ్ సీజనులో కస్టమ్ మిల్లింగ్ బియ్యంను త్వరగా సేకరించాలని జేసీ ఎ మల్లికార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2018-19 సీజనులో కస్టమ్ మిల్లింగ్ బియ్యం, కావాల్సిన గిడ్డంగుల సదుపాయంపై ఎఫ్‌సిఐ, పౌరసరఫరాల శాఖ, స్టేట్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లు, రైసుమిల్లర్లతో జేసీ సమీక్ష చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంనకు గాను 2.57 లక్షల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యం రావాల్సి ఉండగా రైసుమిల్లర్లు 1.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించారన్నారు. బియ్యం వసూలుకు ఎఫ్‌సిఐ ముందుకు రాకపోవడంతో జేసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న బియ్యం ఇతర రాష్ట్రాలకు రవాణా చేసిన తర్వాత గిడ్డంగుల్లో ఖాళీ ఏర్పడుతుందని జేసీకి వారు బదులిచ్చారు. తక్షణమే ఇతర గొడౌన్లలో అద్దె ప్రతిపాదికన తీసుకుని బియ్యం వసూళ్లను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ డిఎం ఇఎన్ జయరాములు, డిఎస్‌ఓ పి ప్రసాదరావు, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.