తూర్పుగోదావరి

పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, డిసెంబర్ 12: పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నిటిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శ్రీకారం చుట్టారు. రూ.63 లక్షల వ్యయంతో నిర్మించిన పది పడకల అదనపు వార్డు భవనానికి ప్రారంభోత్సవం, రూ.2.86 కోట్లతో 30 పడకల సామాజిక ఆరోగ్య భవనం అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి అద్యక్షత వహించారు. సభలో మంత్రి రాజప్ప మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే సామర్లకోట ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఆసుపత్రిలో రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వహించేందుకు డాక్టరును ఏర్పాటు చేస్తామని చెప్పారు. మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చేయడానికి మంత్రి చినరాజప్ప కృషిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, జిల్లా వైద్యుల సమన్వయ అధికారి రమేష్ కిశోర్, టీడీపీ వాణిజ్య విభాగం జిల్లాకార్యదర్శి గుమ్మళ్ళ రామకృష్ణ, ఆసుపత్రి ఇన్‌చార్జి ఎస్పీహెచ్‌వో డాక్టర్ కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అక్రమాల్లో నిండా మునిగిన టీడీపీ
*జనవరిలో బీజేపీ బహిరంగ సభ: ప్రధాని మోదీ రాక*జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య

కాకినాడ, డిసెంబర్ 12: జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు చాలా రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని వారిని త్వరలో నిలదీస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో బీజేపీ అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని చెప్పారు. బుధవారం మాలకొండయ్య స్థానికంగా విలేఖర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, ఎస్వీఎస్‌ఎన్ వర్మ, ఎంపీ తోట నరసింహంలు వివిధ రకాలు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని అలాగే పలువురు ఎమ్మెల్యేలు ఇళ్లు, ఇసుక, మరుగుదొడ్లు, కేంద్రం పథకాల అమలులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని వీరిపై విజిలెన్స్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సీట్ల శాతం తగ్గినా ఓట్లు మాత్రం తగ్గలేదని తెలంగాణలో మాత్రం 2014 కంటే 7 శాతం అధికంగా ఓట్లు లభించాయన్నారు. తెలంగాణలో అక్కడి ప్రజలు చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధిచెప్పారని త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో అదే పరిస్థిది బాబుకు ఎదురవుతుందన్నారు. 2019లో కేంద్రంలో 300 సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందని మాలకొండయ్య చెప్పారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, కార్పొరేటర్ ఎస్ లక్ష్మీప్రసన్న, పైడా వెంకట నారాయణ, కె భీమశేఖర్, దిలీప్ సదనాని, బండారు భాస్కర్, కె హరి ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ క్వార్టర్ల ఆధునికీకరణకు చర్యలు
*డీజీపి ఠాకూర్
కాకినాడ సిటీ, డిసెంబర్ 12: కాకినాడ రిజర్వ్‌పోలీస్ ఆవరణలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర డీజీపి ఆర్‌పి ఠాకూర్ ప్రకటించారు. కాకినాడ సర్పవరం మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన కార్యక్రమం ముగిన అనంతరం బుధవారం మధ్యాహ్నాం నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ విభాగం పనితీరును డీజీపి స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం ఆయన రిజర్వ్ పోలీస్ ఆవరణను సందర్శించి అక్కడ నివాసం ఉంటున్న పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. క్వార్టర్స్ పాడయిన విషయాన్ని ఆయన పరిశీలించి త్వరలో వాటిని ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, ఎఎస్పీ శ్రీ్ధర్‌రావు, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.
చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదు
*ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి
అనపర్తి, డిసెంబర్ 12:తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ధైర్యం లేదని ఉభయ గోదావరి జిల్లా వైసీపీ పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం అనపర్తి వైసీపీ కార్యాలయంలో బూత్ కమిటీ కన్వీనర్లు సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు పరిపాలన పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఆర్ధమైందని అందువలనే తెలంగాణాలో అటువంటి తీర్పు ఇచ్చారన్నారు. ప్రపంచ బ్యాంక్‌ల నుంచి అప్పులు కుప్పలుగా తెచ్చి పచ్చచొక్కా నాయకులు, కార్యకర్తల సంక్షేమాన్ని చూస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం కాని, అభివృద్ధిగాని వారికి పట్టడంలేదన్నారు. నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని కార్యకర్తలు నాయకులు, కో ఆర్డినేటర్లు దేశం పార్టీ ఆగడాలను, పెచ్చుమీరిన అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేయాలనుకున్న నవరత్నాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని రెడ్డి సూచించారు. నవరత్నాల పధకాల ద్వారా ప్రతీ కుటుంబానికి సుమరు 5లక్షల రూపాయల లబ్ధి చేకూరనుందన్నారు. పార్టీ కార్యక్రమాలను నేటి నుంచి ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఈ భాధ్యత నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పై ఉందన్నారు. కష్టపడిన వారికి జగన్ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. వైవీతో పాటు అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మార్గాని భరత్, కవురు శ్రీనివాస్, సత్తి వీర్రెడ్డి, సత్తి సుబ్బిరెడ్డిలు పాల్గొన్నారు.