తూర్పుగోదావరి

నన్నయలో ముగిసిన ప్రయాగ్ 2కె19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ వీక్ ప్రయాగ్ 2కె19 రెండు పాటు జరిగిన కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. విద్యార్థులు పాటలు, నృత్య ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగింపు సమావేశానికి ప్రయాగ్ 2కె19 డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆచార్య ఎస్ టేకి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటూ ఉద్యోగాల్లో స్థిరపడుతున్న నేటి తరం విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకోవాలని వారిని ప్రశంసించారు. అలాగే విద్యార్థులకు సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ముఖ్యమన్నారు. యువత ఉత్సాహంతో ముందుకు సాగాలని, అపుడు ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా ఒత్తిళ్ళు నుంచి బయటపడగలమని చెప్పారు. విద్యతో పాటు సమాజంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులపై దృష్టి సారిస్తూ వుండాలన్నారు. అనంతరం కో-డైరెక్టర్లు, విభాగాధిపతి డాక్టర్ పి ఉమామహేశ్వరి, డాక్టర్ ఎన్ ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునే పాఠ్యాంశాలు ప్రాక్టికల్‌గా ఎలా చేయాలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెలుస్తుందన్నారు. ప్రయాగ్ 2కె19లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎంఎస్‌ఎన్ పీజీ సెంటర్‌ను అతిధులు అభినందించారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విజేతలైన విద్యార్థులకు బహుమతులు, సర్ట్ఫికెట్లు అందజేశారు. వివిధ జిల్లాల నుంచి 800 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి జ్యోతిర్మయి, సహాయాచార్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎఎస్ పద్మవల్లి, జె రవిశంకర్, ఐఎస్‌ఎన్ రాజు, జోహార్ కృష్ణ, వేంకటేశ్వర్లు, డాక్టర్ రమేష్, డాక్టర్ అలీస్ జోయ్, ఎ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు
* ఉత్తర మండల డీఎస్పీగా రాజేంద్రకుమార్
కోరుకొండ, ఫిబ్రవరి 7: జోన్‌లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఉత్తర మండల డీఎస్పీ పిఆర్ రాజేంద్రకుమార్ తెలిపారు. మండల కేంద్రమైన కోరుకొండలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలోని ఉత్తర మండల డీఎస్పీగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్‌లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. డీఎస్పీగా తాను మొదటి పోస్టింగ్ నెల్లూరు చేపట్టానని, తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ డీఎస్పీగా మూడు సంవత్సరాలు పనిచేసానని, ఆ తరువాత విశాఖలో ఏసీపీగా కమ్యునిటీ పోలీసింగ్‌లో విధులు నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉత్తర మండల డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తర మండల పోలీసు సిబ్బంది పదవీ బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని కలిసి అభినందించారు. కార్యక్రమంలో కోరుకొండ సీఐ ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.