తూర్పుగోదావరి

సరిహద్దుల్లో భద్రతాచర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, ఫిబ్రవరి 18: ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ సిహెచ్ త్రివిక్రమవర్మ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం ఆయన ఏజెన్సీలో పర్యటించారు. రంపచోడవరం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. ఏజెన్సీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగానే రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మీదుగా ఏడుగుర్రాలపల్లి, నెల్లిపాక, ఎటపాక గ్రామాల్లో పర్యటించి అక్కడ నుంచి కూనవరం, విఆర్ పురం మీదుగా రంపచోడవరం చేరుకున్నట్టు చెప్పారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీలు, స్టేషన్ సిబ్బందితో మాట్లాడి అక్కడ పరిస్థితులను, వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించటానికి అధికారులకు, పోలీసులకు పలు సూచనలు చేశామన్నారు. గతంలో రంపచోడవరం ఏఎస్పీగాను, జిల్లా ఎస్పీగాను పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఏవోబీలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్నారు. మావోయిస్టులు ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉంటూ సానుభూతిపరులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. అందువల్ల పక్క రాష్ట్రాల పోలీసులతో కలిసి పనిచేస్తూ మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. చింతూరు మండలం సరివెల వద్ద మావోయిస్టులు బస్సు దగ్థం చేసిన సంఘటనలో పాల్గొన్న వారిలో కొంత మందిని అదుపులోనికి తీసుకున్నామన్నారు. మిగిలిన మావోయిస్టుల ముఖ్య నాయకులను త్వరలోనే అదుపులోనికి తీసుకుంటామన్నారు. గిరిజనులు మావోయిజానికి ఆకర్షితులు కాకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మావోయిస్టులు అడవులను వీడి జన జీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని డీఐజీ త్రివిక్రమవర్మ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ చక్రవర్తి, రంపచోడవరం ఏఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.