తూర్పుగోదావరి

అగ్రవర్ణాల నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 18: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదలను ఆదుకొనేందుకు తెలుగుదేశం ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని, పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని ఈబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ కెవివి సత్యనారాయణరాజు అన్నారు. సోమవారం ఆయన పదవి చేపట్టి మొట్టమొదటిసారిగా కోనసీమ ప్రాంతానికి వచ్చి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమలాపురం కిమ్స్ వైద్యకళాశాలలో హాస్పిటల్ సిబ్బంది చైతన్యరాజుకు భారీ స్వాగతం పలికారు. అనంతరం చైతన్యరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం స్థానిక క్షత్రియ కల్యాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్యరాజును ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్‌బాబు ఇందుకూరి నరసింహరాజులు కిమ్స్ ఆసుపత్రిలో చైతన్యరాజును ఘనంగా సత్కరించి భారీ గజమాలతో అభినందించారు. ఈ సందర్భంగా వేటుకూరి విశ్వనాధ్‌రాజు, గాదిరాజు సీతారామరాజులతోపాటు కిమ్స్ డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు, కిమ్స్ సీఈవో కె రఘులు చైతన్యరాజును అభినందించారు.

రాజకీయ కలకలం
*ఎంపీ పండుల పార్టీ మారడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం:వైసీపీలో ఉత్సాహం
అమలాపురం/రామచంద్రపురం, ఫిబ్రవరి 18: అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం జిల్లాలో రాజకీయంగా కలకలం రేపింది. సోమవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవలే ఎంపీ పండుల పార్టీ మారడంపై ఊహాగానాలు వినిపించినప్పటికీ, మూడు రోజుల క్రితమే వాటిని ఆయన కొట్టిపారేశారు. మళ్లీ హఠాత్తుగా ఆయన హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీలో విస్మయం వ్యక్తమవుతోంది. అఖిల భారత సర్వీసు అధికారిగా పనిచేస్తూ, గత ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, అమలాపురం లోక్‌సభ స్థానం కేటాయంచడం జరిగిపోయంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన కాకినాడలో కార్యాలయం ఏర్పాటుచేసుకుని ఉండేవారు. ఎంపీ పండుల పార్టీ మారడాన్ని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ శ్రేణుల్లో సందడి
ఎంపీ పండుల చేరికతో అమలాపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో తెలుగుదేశం పార్టీ నాయకులంతా వైఎస్సార్‌సీపీలో చేరడానికి క్యూ కడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దివంగత రాజశేఖరెడ్డి పాలనను గుర్తుచేసుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా తెలుగుదేశానికి దక్కే పరిస్థితులు ఉండవని విశ్వరూప్ జోస్యం చెప్పారు.