తూర్పుగోదావరి

బాలయోగి వారసునికి టీడీపీ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 18: కోనసీమ ముద్దుబిడ్డ దివంగత లోక్ సభాపతి జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్‌ను అమలాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దింపడానికి పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంటు అనేది త్వరలో విడుదల చేసే మొదటి జాబితాలో స్పష్టత వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కోనసీమలో ఇప్పటికీ బాలయోగి అంటే అభిమానంతో ఉన్న జనాన్ని తమవైపు మళ్లించాలంటే అభిమానంతోనే సాధ్యమవుతుందనే టీడీపీ నాయకుల సూచనల మేరకు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జీఎంసీ బాలయోగి కోనసీమలో చేసిన అభివృద్ధికోసం ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటున్నారు. బాలయోగి బతికి ఉంటే కోనసీమలో ఎప్పుడో రైలు కూత వినిపించేదని, ఆయన లోక్ సభాపతిగా ఉన్న సమయంలో శరవేగంతో బాలయోగి వారధిని నిర్మించిన విషయాన్ని కోనసీమలో నేటికీ చెప్పుకుంటారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఆయన వారసుని ఎన్నికల్లో నిలబెడితే కోనసీమ ప్రజలు బ్రహ్మరథం పడతారనే నమ్మకంతో ఆయన వారసుడిని రంగంలో దింపడానికి సర్వం సిద్ధం చేశారు.

అమలాపురంలో ఐటీ దాడులు
*తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లే టార్గెట్
అమలాపురం, ఫిబ్రవరి 18: అమలాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు పట్టణంలో కలకలం రేపింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అమలాపురం పట్టణంలోని తెలుగుదేశం నాయకులు ఉలిక్కిపడ్డారు. సోమవారం అమలాపురం మోబర్లీపేటలో మాజీ ఏఏంసీ ఛైర్మన్ అల్లాడి సోంబాబు, శరత్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్‌కం టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎంవీ రమేష్ ఆధ్వర్యలో పలువురు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. రాజమండ్రి నుండి పోలీసు బందోబస్తుతో వచ్చిన ఇన్ కంటాక్స్ అధికారులు అమలాపురంలో సోంబాబుకు సంబంధించిన మూడు ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. అయితే సమాచారం విలేఖర్లకు తెలపడానికి అధికారులు నిరాకరించారు. ఎన్నికల కోడ్ వస్తే డబ్బులు తరలించడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయని ఆయా పార్టీల నాయకులు కోట్లాది రూపాయలు తరలించారనే సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సోమవారం ఉదయం ప్రారంభించిన సోదాలు సాయంత్రం వరకూ కొనసాగాయి.