తూర్పుగోదావరి

విద్యుత్తు ఆదాకు ఆధునిక పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 13: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న విద్యుత్తు అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఆదాపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నారు. కాలం చెల్లిన వ్యవసాయ పంపుసెట్ల స్థానే ఆధునిక పంపుసెట్లను, అదీ ఉచితంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 20 ఏళ్ల నుండి వీటితో సతమతమవుతున్న రైతులకు ఈ పథకం వరంగా మారుతుందనే చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలాన్ని కేంద్రం ఎంపికచేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.19 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఎంపికైన ఏకైక మండలం ఇదే కావడం విశేషం. రాజానగరం మండలంలో అత్యధికంగా వ్యవసాయ బోర్లు కలిగావుండటంతో ఈ మండలాన్ని ఎంపికచేశారు. ఇందులో భాగంగా ఈ మండలంలో రైతులకు చెందిన అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ఆధునిక మోటార్లను అమర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫెసియన్సీ సర్వీసు లిమిటెడ్ (ఇఇఎస్‌ఎల్) సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థ రాజానగరం మండలంలో రైతులకు ఉచితంగా ఆధునిక మోటార్లు అమరుస్తోంది. మండలంలో తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యధికంగా 2500 వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటికి ప్రస్తుతమున్న టూ స్టార్ మోటార్ల స్థానంలో ఫైవ్ స్టార్ మోటార్లు అమరుస్తున్నారు. రైతులకు పైసా ఖర్చులేకుండా ఉచితంగా వీటిని అమరుస్తున్నారు. ఇప్పటికే 445 బోర్లకు అమర్చారు. ఇప్పటి వరకూ కాలం చెల్లిన ఈ పంపుసెట్లతో రైతులు సతమతమవుతూ వస్తున్నారు. తరచూ బోర్లు పాడైపోవడం, కాలిపోవడం, సక్రమంగా నీరు రాకపోవడం తదితర కారణాలవల్ల అధిక సమయం మోటార్లను వినియోగించాల్సి వస్తోంది. నీరు సరిగా రాకపోవడంవల్ల అధిక అశ్విక సామర్థ్య (హెచ్‌పి) మోటార్లను కూడా రైతులు వినియోగిస్తున్నారు. దీనికి కూడా కేంద్ర పథకంతో చెక్‌పడనుంది. ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న నాసిరకం 15 హెచ్‌పి మోటార్ల స్థానంలో ఆధునిక 10 హెచ్‌పి మోటార్లు అమర్చుతున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతోపాటు, విచక్షణారహితంగా భూగర్భ జలాల వినియోగం కూడా తగ్గుతుంది.
కొత్త మోటార్లతో త్వరగా నీరు తోడటం పూర్తికావడంవల్ల బోర్ల షెడ్లవద్ద గంటల తరబడి కాపలా ఉండవలసిన పనిలేకుండా పోయిందని రైతులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
అయిదేళ్ల గ్యారంటీతో రోజుకు రెండు మూడు గంటలపాటు తిరిగితే చాలన్న సామర్థ్యం కల్గిన మోటార్లను ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ సమకూర్చుతోంది. రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రాజానగరం మండలం సంపతనగరం, రాజానగరంలలో రెండు సర్వీసు సెంటర్లను ఏర్పాటుచేశారు. రాజానగరంలో ఫలితాలను బట్టి ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు.