తూర్పుగోదావరి

నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట, మే13:సంసద్ ఆదర్శ గ్రామమైన పుల్లేటికుర్రు పంచాయతీ ఏరియాలో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రత్యేకాధికారి పి.శ్రీరామచంద్రమూర్తి, మండల ప్రత్యేకాధికారి బి.దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పుల్లేటికుర్రు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కాండ్రేగుల గోపాలకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించాల్సిన బాధ్యత పంచాయతీతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులపై వుందన్నారు. గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు తమ దృష్టికి తెచ్చి తగిన పరిష్కారాన్ని త్వరితగతిన చూపాలన్నారు. ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతోపాటు ఆరోగ్య సూత్రాలను పాటించాలన్నారు.
ఈ సమావేశంలో ఉపసర్పంచ్ ముత్తాబత్తుల సోమశేఖరరావు, ఎంపిటిసి కత్తుల బాలరాజు, నాయకులు దొమ్మేటి సురేష్, ఎన్‌ఎస్‌ఎన్ వర్మ, కొల్లి సూర్యారావు,కార్యదర్శి ఎస్‌బిఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.