తూర్పుగోదావరి

ఆచి తూచి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 14: ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం తరపున అధికారులు చర్చలు జరుపుతూనే మరోవైపు న్యాయపరంగా ఆయనకు వైద్యాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు బలవంతంగానైనా వైద్య సేవలు అందించి ఆయన ఆరోగ్యాన్ని కాపాడిన అనంతరం మిగతా విషయాలు చర్చిద్దాం అనే ధోరణితో ముందుకు వెళుతున్నట్టు తెలిసింది. దీనిలో భాగంగానే అధికార యంత్రాంగానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా న్యాయపరమైన ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామనే చతురతతో ముందుగానే ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్లో వైద్యులచేత ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. డిమాండ్ల పరిష్కార దిశగా చర్యలు చేపడుతూనే మరోవైపు ఎందుకైనా మంచిదన్నట్లు ఇటు కేసుల పరంగా కూడా న్యాయపరమైన ఆలోచనలతో రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ముద్రగడ దీక్ష విరమణకు సమస్యను సానుకూలంగా పరిష్కరించే క్రమంలో ఇటా అటా ఇన్న విధానంలోనే సమస్యను ఎదుర్కొనేందుకు అన్ని వైపుల నుండి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కాగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రఆమరణ దీక్ష మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ముద్రగడను ఎట్టకేలకు ఒప్పించి, మంగళవారం ఉదయం నుంచి ఆయన భార్య, కోడలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్న కుమారుడు గిరి కూడా ఆయనతో పాటు దీక్ష కొనసాగిస్తున్నారు. చర్చల ప్రక్రియ మొదలైంది. ఉత్కంఠభరిత వాతావరణం అలుముకుంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఏమి జరుగుతోందో తెలియని విధంగా అంతా గోప్యంగా నడుస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న కాపు నాయకులు ఆకుల రామకృష్ణ, గణేశుల రాంబాబు, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణులను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి అత్యంత గోప్యంగా పోలీసులు మళ్లీ వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గోప్యంగానే కాపు జెఎసి నాయకులు, అధికారులు ముద్రగడతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో ప్రధానంగా డిమాండ్ల సాధన విషయం ఎలా ఉన్నప్పటికీ ముద్రగడకు మానసికంగా ఎదురైన బాధను మాత్ర పరిష్కరించాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. కిర్లంపూడిలో దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుకు తీవ్రంగా కలత చెందిన ముద్రగడ అందుకు బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా చేసినట్టు తెలిసింది. డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి పూర్తిగా లిఖితపూర్వకమైన హామీనిచ్చిన తర్వాతే దీక్ష విరమణకు అవకాశం ఉందని ముద్రగడ స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా ముద్రగడతో చర్చించేందుకు వెళ్లారు. మంగళవారం ఉదయానికి ముద్రగడ బాగా నీరసించిపోయారు. మధ్యాహ్నానికి బలవంతంగానైనా వైద్యం చేయాల్సిందేనని వైద్యులు స్పష్టంచేశారు. వైద్యం చేయించుకోవాల్సిందిగా ముద్రగడ పద్మనాభం తనయుడు బాలు ద్వారా ఒప్పించేందుకు వైద్యులు, అధికారులు ప్రయత్నించారు. ప్రతీ గంటకూ వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తూనే వున్నారు. ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్ ముద్రగడ దంపతుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాకినాడ జిజిహెచ్‌కు చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ శర్మ, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి వైద్యం చేసేందుకు వచ్చారు. ముద్రగడ భార్య, ఆయన కోడలు ఆరోగ్య పరిస్థితి వైద్యపరంగా అదుపులో ఉందని వైద్యులు తెలిపారు. జిల్లా అంతటా ఉద్విగ్న పరిస్థితి అలుముకుంది. ఉద్రిక్తత మాటున జిల్లా ప్రశాంతంగా మారింది. ప్రతీ గంటకొకసారి వైద్యం చేసేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తూనే వున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీలు ఆసుపత్రికి చేరారు. మధ్యాహ్నం ఒంటి గంటా యాభై ఆరు నిమిషాలకు కాపు నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, గణేశుల రాంబాబులను వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుతూ జిల్లా అంతటా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఎక్కడికక్కడ ఆందోళన పెల్లుబికింది. ప్రభుత్వం ఈ సమస్యను ఏదోవిధంగా చాకచక్యంగా పరిష్కరించామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ ముద్రగడ గాయానికి శుశ్రూష చేసేందుకు యంత్రాంగం ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తే తప్ప సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందంటున్నారు.