తూర్పుగోదావరి

రేషను బియ్యం ఎగుమతి చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 17: ఎగుమతుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన (పిడిఎస్) బియ్యం ఉంటే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి ఎస్ సత్యనారాయణ బియ్యం ఎగుమతిదారులను హెచ్చరించారు. శుక్రవారం జెసి తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు, బియ్యం ఎగుమతిదారులతో కలిసి బియ్యం ఎగుమతి విధానంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ బియ్యం ఎగుమతిలో పిడిఎస్ పంపిణీ చేసే బియ్యం కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఈ విధంగా ఎవరైనా చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. కాకినాడ నుండి 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎగుమతి చేస్తున్నామని, రాష్ట్ర మొత్తంమీద 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరుగుతోందన్నారు. జిల్లా నుండి ఎగుమతి జరుగుతున్న 11 లక్షల మెట్రిక్ టన్నుల్లో పిడిఎస్ బియ్యం కూడా కలుస్తున్నాయని ఆరోపణలు రావడంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు హాజరైన 9 మంది ఎగుమతిదారులతో జెసి చెప్పారు. గత వారం చింతూరులో పిడిఎస్ బియ్యం ఎగుమతి అవుతున్నాయని సమాచారం రావడంతో పట్టుకున్నామని వారితో జెసి చెప్పారు. జిల్లాలో 5 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, బయట 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం 9 లక్షల వరకు కొనుగోలు చేశామని, అందులో 66 శాతం ఎగుమతి చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఎస్‌ఓ జి ఉమామహేశ్వరరావు, సివిల్ సప్లయిస్ డిఎం కె కృష్ణారావు, బియ్యం ఎగుమతిదారులు సూరిబాబు, మట్టే సూరిబాబు, మురళీమోహన్ తదితరులున్నారు.