తూర్పుగోదావరి

పుష్కర ఎత్తిపోతల పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, జూలై 14: మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో గోదావరి నదిపై ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గోదావరి నది పరీవాహక ప్రాంతాలు, లంకముంపు గ్రామాలను ఆయన పరిశీలించినట్టు చెప్పారు. అలాగే పుష్కర ఎత్తిపోతల పథకం వద్ద నీటిమట్టం, గోదావరి ఉద్ధృతి పరిశీలించినట్టు ఆయన తెలిపారు. త్వరలో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని విడుదల చేయనున్నట్టు కలెక్టరు వెల్లడించారు. గోదావరి ఏటిగట్టు సమీప గ్రామాలైన వంగలపూడి, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, గోదావరి రేవులను పరిశీలించినట్టు కలెక్టరు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇ సుధాకర్, తహసీల్దారు కనకం చంద్రశేఖర్, ఎంపిడివొ డి శ్రీనివాస్, ఎంపిపి చిట్టూరి శారదా రంగారావు, జడ్పీటీసీ కాండ్రు త్రివేణి శ్రీనివాస్, మాజీ ఎంపిపి పెందుర్తి దేవదాస్, ఎంపిటిసి షేక్ వలి అధికారులు పాల్గొన్నారు.
కపిలేశ్వరపురం మండలంలో...
కపిలేశ్వరపురం: కపిలేశ్వరపురం మండలంలో వరద ముంపునకు గురైన కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపునకు గురైన 700 ఎకరాల అరటి తోట, 600 ఎకరాల్లోని కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు జారీచేశారు. నీరు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని ఉద్యానవన శాఖ అధికారి భవిత రైతులకు తెలిపారు. కాగా కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి పివివి సత్యనారాయణ, ఎంపిడిఒ వి అబ్రహంలింకన్, తహసీల్దార్ జి చిన్నిబాబు, ఎఒ పి సురేష్ పాల్గొన్నారు.