తూర్పుగోదావరి

కార్పొరేషన్ ఖాతాలోకి కళాకేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 19: చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆనం కళాకేంద్రం నిర్వహణ బాధ్యతలను నగరపాలక సంస్థకు అప్పగించడం తీవ్ర కలకలం రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కళాకారులు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఆనం కళాకేంద్రం నిర్వహణను కార్పొరేషన్‌కు అప్పగిస్తే అధోగతేనని ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ సంస్థలు, ప్రభుత్వ నిధులతో ఇపుడిపుడే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్న ఆనం కళాకేత్రాన్ని కార్పొరేషన్‌కు అప్పగించడం హేతుబద్ధం కాదని కళాకారులు ఆందోళన చెందుతున్నారు.
గత గోదావరి పుష్కరాలు, రాష్టస్థ్రాయిలో జరిగిన అమరావతి లీడ్ మేప్ సమీక్ష తదితర ప్రభుత్వ విధానపరమైన ఎన్నో కార్యక్రమాలకు రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రం వేదికైంది. నంది నాటకోత్సవాలు సైతం ఈ క్షేత్రంలోనే జరిగాయి. ఎంతో చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన ఈ కళాక్షేత్రాన్ని నగరపాలక సంస్థకు అప్పగిస్తే నిర్వహణ కుంటుపడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఈ కేంద్రం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదే విధంగా కొనసాగించాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఈ కళాకేంద్రం కలెక్టర్ ఛైర్మన్‌గాను, జిల్లా సమాచార పౌర శాఖాధికారి కార్యదర్శి, నగరపాలక సంస్థ కమిషనర్, మేయర్, సంబంధిత కార్పొరేటర్ సభ్యులుగా, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు గౌరవ సభ్యులుగా వున్నారు. ఇపుడు నిర్వహణ బాధ్యతలు కార్పొరేషన్‌కు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కమిషనర్‌కు సెక్రటరీ కం ట్రెజరర్ బాధ్యతలు అప్పగిస్తూ, జిల్లా పౌర సంబంధాధికారిని జాయింట్ సెక్రటరీగా చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆనం కళాకేంద్రం నిర్వహణ సర్వం కార్పొరేషన్ అధీనంలోకి వెళ్తుంది. పుష్కరాలకు ముందు ఎసి సౌకర్యం లేకుండా ఈ కళాకేంద్రంలో కార్యక్రమ నిర్వహణకు రోజుకు ఐదువేలు, సాంస్కృతిక కార్యక్రమాలకైతే రెండువేల చొప్పున అద్దె తీసుకునేవారు. పుష్కరాలకు ముందు దాతల సహాయంతో కళాకేంద్రం మొత్తం ఎసి చేయించారు. దీంతో అప్పటి నుంచి రోజుకు ఎసితో రూ.30 వేలు, నాన్ ఎసి అయితే రూ. 20 వేలు అద్దె నిర్ణయించి అమలుచేస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎంత వినియోగిస్తే అంతకు యూనిట్‌కు రూ.15 చొప్పున అద్దెకు చెల్లించుకోవాల్సి వుంది. అదే సాంస్కృతిక కార్యక్రమాలకైతే ఎసి రూ.20 వేలు, నాన్ ఎసి అయితే రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఇదే కళాకారులకు భారంగావున్న నేపథ్యంలో ఇపుడు మళ్ళీ కార్పొరేషన్ అధీనంలోకి వెళితే నిర్వహణ కూడా సక్రమంగా వుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ చారిత్రక ప్రాశస్థ్యం కలిగి. నగరానికే ల్యాండ్ మార్కుగా వున్న ఆనం కళాకేంద్రాన్ని మరింత మెరుగైన రీతిలో యధావిధిగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతనే నిర్వహణ బాధ్యతలను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.