తూర్పుగోదావరి

వంద కేజీల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, ఆగష్టు 21: అక్రమంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాపై అన్నవరం పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు అన్నవరం ఎస్‌ఐ పార్ధసారధి తెలిపారు. అన్నవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రౌతులపూడి మండలంలోని గిడజాం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గంజాయి నిల్వ చేసినట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 100 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా, గిడజాం గ్రామానికి చెందిన గంటా లోవరాజు, గూడెం కృష్ణలను అదుపులోకి తీసుకున్నట్లు అన్నవరం ఎస్‌ఐ పార్ధసారధి తెలిపారు. ఇంకనూ దీనిపై ధర్యాప్తు జరుగుతుందని, వీరి వెనుక ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా.. అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారాన్ని సోమవారం అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రత్తిపాడు సిఐ సూర్యనారాయణ విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడిస్తారని ఎస్‌ఐ పార్ధసారధి తెలిపారు.