తూర్పుగోదావరి

బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఆగస్టు 23: ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్సను అందజేస్తున్నట్లు కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలియజేశారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జిల్లాకు చెందిన బాధితులను మంగళవారం వేకువజామున కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా కలెక్టర్ అరుణ్‌కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మంగళవారం వారిని పరామర్శించి బాధితులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారని, మరో 12 మంది గాయపడ్డారన్నారు. మృతుల కుంటుంబాలకు సిఎం చంద్రబాబునాయుడు మూడు లక్షల రూపాయలు వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని, గాయపడిన 12మందిలో ముగ్గురిని డిశ్చార్జి చేశారని తెలియజేశారు. డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు ఇతర అధికారులు సహాయక చర్యల కోసం ఖమ్మం వెళ్లి బాధితులను జిల్లాకు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారని వివరించారు. డిప్యూటీ సిఎం చినరాజప్ప బాధితులకు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని తెలిపారు. బాధితులను జెసి ఎస్ సత్యనారాయణ, కమిషనర్ ఆలీంబాషా, ఆర్డీవో అంబేద్కర్ పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు.
బాధితులను ఆదుకుంటాం
ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ అరుణ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు అవసరమైన సహాయంతో పాటు మెరుగైన చికిత్స అందజేయాలని కోరినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని నరసింహం హామీ ఇచ్చారు.