ఉత్తరాయణం

నేత కార్మికులారా! చావొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేత కార్మికులు బ్రతుకుదెరువుకోసం క్రొత్త దారిని ఏర్పరచుకొని మరో వ్యాపారంలోకి వెళ్ళాలి. చేనేత బట్టలు ఈనాటి యువతకు రుచించవాయె. ఇప్పుడంతా జీన్స్, టీషర్ట్ రెడీమేడ్.. ఇదో ట్రెండ్. ముసలివాళ్లు కూడా టీషర్ట్స్ వేస్తున్నారు. ఆ బట్టలన్నీ మిల్లునుండి వస్తున్నాయి కదా! మరి అలాంటప్పుడు చేనేత వస్త్రాల వ్యాపారం మందకొడిగానైనా సాగేటట్లు లేని పరిస్థితి. అందుకు నేత కార్మికులు ముంబయి వెళ్ళి మిల్లులో పనిచేయడమైనా చేయాలి. లేదా బ్యాంక్‌లోను అదే రెడిమేడ్ బట్టల ఫ్యాన్సీ షోరూంలాంటివైనా పెట్టుకోవాలి కాని అలా కాకుండా అప్పుల బాధలకు ఆత్మహత్యలు సరికాదు. వారు మగ్గాన్ని వదలివేసి కొత్త దారి వెతుక్కొని వ్యాపార రంగంలో చేరితే బోలెడు డబ్బులొస్తాయి కదా!
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్
సమగ్ర వివరాలుండాలి
ప్రభుత్వం చేపట్టే భూమి వివరాల నమోదులో గత 15 సం.ల భూ సంబంధ వివరాలన్నీ క్షుణ్ణంగా నమోదుచేయాలి. చాలాచోట్ల వందలాది ఎకరాల ఇనాం, దేవాదాయ తదితర భూములు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు వారి అనుచరులకున్నాయి. వాటి వివరాల వెల్లడికి వారు అడ్డుపడేవీలుంది. సి.ఎం. చంద్రబాబు ఈ అంశాలపై నిశిత పరిశీలన, నిఘా ఉంచి, భూములు వాస్తవ వివరాల్ని సర్వే రికార్డుల వివరాల్ని నమోదుచేయటం వలన చాలా భూసంబంధ సమస్యలను, వివాదాలను నివారించొచ్చు. ప్రతి మండలంలోగల భూ వివరాల్లో ముఖ్యాంసాలు, ఇనాం, దేవాదాయ, గ్రామ కంఠం సంబంధ వివరాల్ని నమోదుచేయటం చాలా ముఖ్యం. లేకపోతే ఈ కార్యక్రమం లక్ష్యం నీరుగారిపోతుంది.
- కె.శ్రీనివాస్ పట్నాయక్, విజయవాడ
రైలుమార్గం నిర్మించాలి
జాతీయ స్థాయిలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సరాసరికన్నా అతి తక్కువ రైలుమార్గం కలదని అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా నిజామాబాద్ నుండి విజయవాడకు సిద్ధిపేట, జనగామ మరియు సూర్యాపేటలను ఉత్తరంనుండి దక్షిణంగా కలిపే సుమారు 42,300 కిలోమీటర్లు ప్రాంతంలో బీబీనగర్ నుండి కాజీపేట వరకు మినహా మరెక్కడ రైల్వేలైల్ లేదు. అందువల్ల మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని ఈ ప్రాంతం చాలా వెనుకబడి వుంది. అందువల్ల నిజామాబాద్ నుండి సిద్ధిపేట, జనగామ మరియు సూర్యాపేటలను కలుపుతూ విజయవాడ వరకు కొత్త రైలుమార్గం వేస్తే, ఇది ఈ ప్రాంతాల సత్వర అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ విషయాన్ని ఈ ప్రాంతం రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కాబట్టి సత్వరమే నిజామాబాద్‌నుండి సిద్ధిపేట, జనగామ, సూర్యాపేటల ద్వారా విజయవాడ వరకు రైల్వేలైన్ వేయాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే కేంద్రంతో సంప్రదించి రైల్వేలైను వేసేలా కృషిచేయాలని ఈ ప్రాంత ప్రజలందరి తరఫున మా విన్నపం.
- బెలిదె వీరశంకరు, హైదరాబాద్
శాశ్వత సభ్యత్వం ఎప్పుడు?
అన్నిరంగాలల్లోను అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తున్న భారత్‌కు యుఎన్‌ఓలో శాశ్వత సభ్యత్వం ఇప్పటివరకు లేకపోవుట చాలా విచారకరం. శాశ్వత సభ్యత్వం చర్చకు వచ్చినప్పుడల్లా, అమెరికా మోకాలడ్డుట గమనార్హం. ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగాలి. ఎన్‌డిఎ పదవీ కాలంలోనైనా శాశ్వత సభ్యత్వం లభించేలా నాయకులు కృషిచేయాలి. ఈ విషయమై అమెరికాను ఒప్పించుట మోడీ ప్రభుత్వంపై గలదు. 130 కోట్ల జనాభా ఆశయంమేరకు ఇది సాధించుదామని ఆశిద్దాం.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు
మద్యపాన నిషేధం హర్షదాయకం
బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటించిన సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రజల ఆరోగ్యానికి పరిపూర్ణ వరం! త్రాగుడుకు అలవాటుపడి సంసారాలు బుగ్గిపాలు అవుతున్న నేటి చర్య విషాదాంతం! కేవలం ఆదాయం కొరకు మద్యపానం షాపులు విచ్చలవిడిగా బహిరంగంగా వ్యభిచారంకన్నా మిన్నగా సాగుతుండడం ఎంతో సిగ్గుచేటు! కొన్నిచోట్ల మహిళలు త్రాగి తందనాలు ఆడుతుంటే సిగ్గుతో తలదించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. బాపూజీ కలలుకన్న మద్యపాన నిషేధం అన్ని రాష్ట్రాలు చట్టపరిధికి లోబడతాయా?
- కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు
భాషాభిమానం తిండి పెడ్తుంది
‘్భషాభిమానం’ తింటి పెట్టదు అన్న రమేష్‌గారి అభిప్రాయం వాస్తవ విరుద్ధంగా వుంది. తెలుగు మీడియంలో చదివినా చక్కగా ఇంగ్లీషు వస్తుంది.