ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
మీ ఉత్సాహానికి పెద్దల సహకారం తోడవడంతో పనులు వేగంగా సాగుతాయని ఆశించవచ్చు. సహచరులు, భాగస్వాములతో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ఫలితాలు మెండుగా ఉంటాయి. వృత్తి విద్యా రంగాలలో లభించే అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్య పరిరక్షణకై మందులను వాడటం అవసరం. వాహనాలు నడిపేటప్పుడు ఏమరుపాటు కూడదు. ఇన్సూరెన్స్, సహకార రంగాలు అనుకూలం.

వృషభం (మే 15 - జూన్ 14)
మీ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆత్మీయులను కలిసి పూర్వానుభవాలను గుర్తు తెచ్చుకుంటారు. వ్యవధానం లేకుండా పనులు చేయాల్సి వచ్చినా అనుకున్నది సాధించడంతో తృప్తి లభిస్తుంది. ఆశ్రీతులు, అనుయాయులతో కలిసి శుభ కార్య నిర్వహణకు పూనుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంక్షేమ, విద్యా సంబంధ విషయాలలో ఏకాగ్రత చూపితే మీ ఆశయాలు నెరవేరగలవు.

మిథునం (జూన్ 15 - జూలై 14)
అనుభవజ్ఞుల సలహాలు మీ వ్యవహారాలు సక్రమంగా నిర్వహించడానికి ఉపయోగపడుతాయి. సోదర వర్గంతో రాకపోకలు పెరుగుతాయి. సమాజంలో, వాతావరణంలో జరిగే మార్పులు మిమ్మల్ని కొత్త నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తాయి. అవసరార్థం చేబదుళ్లు, రుణాలు తీసుకోవలసి వచ్చినా త్వరలోనే తీర్చగలుగుతారు. క్రీడలు, ప్రయాణాలు ప్రోత్సాహకరంగా ఉంటాయనవచ్చు. ఉన్నత విద్యలకు కావలసిన వనరులు, వసతులు అమర్చుకో గలుగుతారు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
వివాదాస్పద అంశాలను ప్రక్కన పెట్టి ముఖ్య విషయాలలో ఏకాగ్రత చూపుతారు. మీ అవసరాలను గమనించి సహచరులు, శ్రేయోభిలాషులు చేయూత నిస్తారు. కొత్త ప్రణాళికలను తయారుచేసి, ఆచరణలోనికి తేవడానికి కొంత సమయం పట్టవచ్చు. గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రవచనాలు, ఆధ్యాత్మిక విషయాలు మీలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఆత్మీయుల భావనలు, ఉద్దేశాలు అర్థం చేసుకొని వారిని ప్రోత్సహిస్తారు. ధనలోపం ఉండదు.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
మిత్రులు, సహచరులు మీ కార్య సాఫల్యత లోపాలు పంచుకుంటారు. ప్రజాహిత కార్యక్రమాలకై సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ వ్యక్తుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేసాతరు. భాగస్వాములతో వ్యవహారాలు ప్రోత్సాహకరంగానే ఉన్నా అలసత్వం కూడదు. అనుకోని ప్రయాణాలు, వ్యయ ప్రయాసలు బుధ, గురువారాలలో ఉండవచ్చు. రావనుకున్న పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. మీ చాతుర్యం, చాకచక్యం ప్రదర్శించి జఠిలమైన సమస్యలను పరిష్కరించ గలుగుతారు.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
ఆలస్యంగానైనా ఇతరులు మీ అభిప్రాయాలు సరైనవని గ్రహించి మీకు సహకరిస్తారు. వ్యతిరేకతలు తగ్గి వృత్తి, వాణిజ్యాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. పునఃచరణ ద్వారా విద్యార్థులు మెరుగైన స్థితికి చేరుకోగలుగుతారు. కుటుంబ విషయాల్లో మీ ప్రాధాన్యత ఇనుమడిస్తుంది. పోటీలు, పరీక్షలలో విజయులుగా నిలుస్తారు. పెట్టుబడులు పెరిగినా లాభదాయకంగానే ఉంటాయనవచ్చు. సుదీర్ఘ కృషి తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరింపబడటం ఆనందం కలిగిస్తుంది.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
మీ ఆధ్వర్యంలో వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రత్యర్థులు, సహచరురలు మీ అభిప్రాయాలను మన్నించి సహకరిస్తారు. దీక్షా దక్షతలు ప్రదర్శించి అధికారులను ఆకట్టుకుంటారు. ప్రయాణాలు అధికమయినా ఫలితాలు బాగానే ఉంటాయి. ఖర్చులు పెరిగినా ఆదాయం తగినంతగా ఉంటుందనటంలో సందేహం లేదు. అవసరమైన ధృవపత్రాలు, డాక్యుమెంట్లు చేతికందుతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
మీకున్న పరపతిని వినియోగించి ఆత్మీయుల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికపరంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగాలలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆది, సోమవారాలు మినహాయిస్తే మిగతా దినాల్లో పనులన్నీ ఆశించిన విధంగా సాగుతాయనవచ్చు. స్ర్తిలతో, పిల్లలతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులను అదుపు చేయడం మంచిది.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
మీకెన్ని సమస్యలున్నా ఆందోళన చెందక అనుయాయుల అభిమతాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థి వర్గం వారు మీ ప్రతీ చర్యను గమనిస్తున్నా చింతించాల్సిన పనిలేదు. భవిష్యత్ ప్రణాళికలను అమలుపరిచేందుకు కావలసిన అనుమతులు లభ్యమవుతాయి. విద్యా, ఉద్యోగ రంగాల్లో మీ ఆధిపత్యం నిరూపించుకో గలుగుతారు. నైపుణ్యం పెంపు చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు. రుణాలు, బ్యాంకు లావాదేవీలలో మెలకువ అవసరం.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
అనుకోని బాధ్యతలు మీద పడుతాయి. గతంలో మీ వల్ల లాభం పొందినవారు మీ అవసరాలకు కొంతైనా సాయపడ గలరు. ఆత్మీయుల ఆరోగ్యంలో మార్పు, సన్నిహితుల వియోగం మీకు తాత్కాలిక అశాంతిని కలిగించవచ్చు. విలువైన వస్త్భ్రారణాలు, గృహోపకరణాలు సమకూరుతాయి. పెద్దలు మీ మాటకు విలువనిచ్చి గౌరవిస్తారు. స్వీయ పర్యవేక్షణలో బృహత్ప్రణాళికలకు శ్రీకారం చుడుతారు.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
ఆత్మీయుల సాహచర్యంలో మీ మనస్సులోని అనుమానాలు తొలగిపోతాయి. ఇతరుల సమస్యలకు సరైన పరిష్కారాలు సూచించి మీ ప్రాధాన్యతను చాటుకుంటారు. వింతలు, విడ్డూరాలు తెలుసుకుని వాటి గురిచి లోతుగా పరిశీలన చేస్తారు. దినచర్యలు సంతృప్తికరంగా సాగుతాయి. అంతర్గత విభేదాలు తొలగి సోదర వర్గంతో సాన్నిహిత్యం పెరుగుతుంది. 8,9 తేదీల్లో శుభ వర్తమానాలు, మిత్ర సందర్శనం, ఆహ్వానాలు ఉంటాయి.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
ప్రతీ విషయంలో శ్రమ, ఆలస్యం తప్పకపోయినా అంతిమ విజయం మీదే. మీ గొప్పతనం, నిజాయితీ తెలుసుకుని మిమ్మల్ని గర్హించిన వారే మీ ప్రాపకం కోరుతారు. ఆత్మన్యూనత వీడి విశ్వాసం పెంపు చేసుకో గలుగుతారు. వాడివేడి చర్చల మూలంగా కొంత అసహనం ఏర్పడినా అనుచరులు మీ మార్గానే్న అనుసరిస్తారనవచ్చు. ప్రజాబాహుళ్యంలో మీ పేరు ప్రతిష్ఠలు ద్విగుణీకృతమవుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు.

ఎస్.రవిప్రకాశ్