బిజినెస్

కర్బన ఉద్గారాలపై విస్తృత ఆంక్షలు భారత్ పోటీతత్వానికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయం కోసం పోరాడుతాం : కేంద్ర మంత్రి గోయెల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, నవంబర్ 26: కర్బన ఉద్గారాలపై విస్తృత స్థాయలో ఆంక్షలు విధించడం భారత దేశ పోటీ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ నెలాఖరు నుంచి అంతర్జాతీయ స్థాయి చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘కర్బన ఉద్గారాలపై అనేక ఆంక్షలు విధించడం భారత దేశ పోటీ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సమర్ధవంతంగా అమలు జరగాలంటే అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో కూడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్థమాన దేశాలకు అందజేయాలి’ అని గోయెల్ గురువారం ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. వాతావరణ పరిరక్షణకు సంబంధించి భారత్ రూపొందించుకున్న ప్రణాళికను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో పారిశ్రామిక, వ్యాపారవేత్తలు తమవంతు సహాయ సహకారాలను అందజేయాలని కూడా ఆయన కోరారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో ఐక్యరాజ్య సమితి ఈ నెల 30 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాల విషయంలో న్యాయం కోసం భారత్ గట్టిగా పోరాడుతుందని, భారత దేశం అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలన్నీ గుర్తించి తీరాలని గోయెల్ పునరుద్ఘాటించారు.