అంతర్జాతీయం

వెనకబడ్డ హిల్లరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 19: అమెరికా అధ్యక్ష రేసులో డిమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న హిల్లరీ క్లింటన్ సమీప అభ్యర్థి బెర్ని శాండర్స్ కన్నా కొద్దిగా వెనకబడి ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫునే బరిలో ఉన్న 74 శాండర్స్‌కు జాతీయ పోల్ సర్వేలో ప్రాథమింగా 47 శాతం ఓట్లు సాధించారు. 44 శాతం ఓట్లతో హిల్లరీ క్లింటన్ రెండో స్థానంలో నిలిచారు. గతనెలలో పోల్‌సర్వేలో క్లింటన్ 49 శాతం ఓట్లు పొంది మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దక్షిణ కరోలినాలో 68 ఏళ్ల క్లింటన్ ఆధిక్యత కనబరుస్తున్నారు. బెర్ని శాండర్స్ 28 పాయింట్లు వెనకబడి ఉన్నట్టు పోల్ సర్వే చెబుతోంది. రిపబ్లికన్ పార్టీతరఫున డొనాల్డ్ ట్రంప్ 38 శాతం ఓట్లు సాధించారు. నెల రోజుల క్రితం 49 ఓట్లు శాతం డిమోక్రటిక్ ఓట్లు హిల్లరీ క్లింటన్ సాధించారు. అంతకు ముందు వేసవిలో క్లింటన్ 46 పాయింట్లు, రెండు నెలల క్రితం 22 పాయింట్లు పొందారు. జాతీయ పోల్ సర్వేలో శాండర్స్‌కన్నా వెనకబడి పోవడం గమనార్హం. తాజా సర్వేలు పరిశీలిస్తే హిల్లరీ క్లింటన్ మద్దతు రానురాను తగ్గిపోతున్నట్టు కనిపిస్తోందని డమోక్రటిక్ పోలింగ్ విశే్లషకుడు అండర్‌సన్ వ్యాఖ్యానించారు.