మెయన్ ఫీచర్

మోదీపై ఎందుకింత అక్కసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసున మల్లెల మాలలూగెనే అని దేవులపల్లివారు అరవై సంవత్సరాల క్రితం ఒక చిత్రగీతం రాశారు. ఇప్పుడు 2016లో దానిని కొంచెం మార్చి ‘‘మనసున మాల్యల మాలలూగెనే’’ అని పాడుకోవాలి. పదివేల కోట్ల ధనం బ్యాంకులకు ఎగగొట్టి విజయమాల్యా ఇంగ్లండ్‌కు పారిపోయాడు. దేశంలో ఇంకా వందలాది మంది మాల్యాలున్నారు. ఏ వ్యాపారమూ చేయకుండా దేశ ఆర్థిక ప్రగతి ఎలా సాధ్యమవుతుంది? కార్తి చిదంబరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసి ఆర్థికోన్నతి సాధించాడు. 2016, మార్చి 1 నాడు లోక్‌సభలో జయలలితకు చెందిన ఎఐడిఎంకె సభ్యులు కార్తి చిందబరం చేసింది అక్రమ వ్యాపారం అని గొడవ చేశారు. కార్తి తండ్రి భారతదేశానికి ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా పనిచేసిన గౌరవనీయులైన పి. చిదంబరం గారు. అంటే తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని కార్తి చేసిన అక్రమ వ్యాపారం ఏమిటి? పూర్తి విచారణ జరిపితే దేశ ప్రజలకు తెలుస్తాయి. ఇప్పుడు మాజీ హోంశాఖ ప్రధాన కార్యదర్శి జికె పిళ్లై మాట్లాడుతూ ‘నాచేత అక్రమాలు చేయించింది పి. చిదంబరం గారే’ అని వెల్లడించారు. అక్రమం ఏమిటి? అందుకు సంబంధించిన కథా కమావిషు ఏమిటి?
బిహారుకు చెందిన ఇష్రాత్ జహాన్ అనే పాకిస్తాన్ ఏజెంటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని చంపడం లక్ష్యంగా పనిచేసింది. ఇందుకు యుపిఎ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందనేది ఆరోపణ. అయతే ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్‌లో మరణించింది. ఇంకేముంది? కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మోదీ మీద దాడికి దిగింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అన్నది. అమాయకురాలైన ముస్లిం మహిళను పొట్టన పెట్టుకున్నారు అని నానా అల్లరి చేశారు. అప్పటి హోంశాఖ కార్యదర్శి పిళ్లై ఉగ్రవాదుల జాబితాను రహస్యంగా తయారు చేసి హోంమంత్రి చిదంబరానికి పంపించారు. అందులో ఇష్రాత్ జహాన్ పేరు ఉంది. వెంటనే చిదంబరం పిళ్లైను పిలిచి చీవాట్లు పెట్టి కొత్త అఫిడవిట్‌ను అమె పేరు లేకుండా తయారుచేయమని కోరాడు. సరిగ్గా ముప్పయి రోజుల్లో మొదటి అఫిడవిట్‌ను బుట్టదాఖలు చేసి పిళ్లై రెండవ అఫిడవిట్‌ను తయారు చేశారు. ఇది సీక్రెట్ ఫైల్ కాబట్టి పత్రికలకు తెలిసే అవకాశం లేదు.
2016, మార్చి7వ తేదీన జి.కె. పిళ్లై ఈవిషయాలన్నీ స్వయంగా బయటపెట్టారు. ఐతే కాంగ్రెస్‌వారు పార్లమెంట్‌లో చిదంబరాన్ని రక్షించే యత్నం చేశారు. పిళ్లై ఏదో స్వార్థంతో ఆ పని చేస్తున్నాడు అన్నారు. నిజమే కావచ్చు. పిళ్లై స్వార్థం గురించి మాట్లాడారే కాని అఫిడవిట్ అబద్ధం అని కాంగ్రెస్‌వారు కూడా అన డం లేదు. ఎందువల్ల? ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమంటే ఎప్పుడూ తెల్లని బట్టలు వేసుకొని, మితభాషి, మృదుభాషిగా పేరు తెచ్చుకున్న ఈ లండన్ విద్యార్థి ఎందుకింత దేశద్రోహానికి ఒడిగట్టాడు? ఇలాంటి వ్యక్తి దేశ హోం మంత్రిగా నియమింపబడడం ఏమిటి? అంటే చిదంబరం, సోనియాగాంధీ చేతిలో పావుగా దాదాపు పాతిక సంవత్సరాలు ఉపయోగపడ్డట్టే కదా! మరి ఆమె ఎందుకిలా చేసింది?
ఇష్రాత్ జహాన్ గూఢచర్య వివరాలు ఇప్పుడు బహిర్గతమైనాయి కాబట్టి ఆమెపై జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఎవరూ చట్టప్రకారం సమర్ధించలేరు. ఇప్పుడొక డిటెక్టివ్ కథ చూడండి. యుపిఎ హయాంలో హోంశాఖలో అండర్ సెక్రటరీ ఆర్‌ఎస్‌ఎ మణి అని ఒక దాక్షిణాత్యుడు ఉన్నాడు. ఒక సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్లాడు. అతడు ఎటు వెళుతుంటే అటు తనను ఎవరో నీడలా వెన్నాడుతున్న భావన కలిగింది. కొంత సేపటికి ఆ వ్యక్తి ఎవరో పోల్చుకున్నాడు. ఆమెపేరు అర్చనా రామచంద్రన్. సిఐడి డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక మహిళ. మఫ్టీలో ఉంది. ఇంతలో మణి స్నేహితుడు ఒకాయన వచ్చి మణితో ఇలా చెప్పాడు. ‘‘అర్చన మీతో ఏదో రహస్యంగా మాట్లాడాలనుకుంటున్నది’’ అని. అయతే మణి అందుకు తిరస్కరించి వెళ్లిపోయాడు. ఆ మరునాడు మణిని సిట్ విభాగానికి చెంపిన సురేష్ వర్మ వచ్చి కలిశాడు. ‘మణీ’ నువ్వు ఇష్రాత్ జహాన్ అఫిడవిట్ తయారు చేశావు కదా-దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతున్నది. అందుకని ఆ అఫిడవిట్‌ను రద్దు చేసి రెండవది రాయాలి’. మణి అందుకు ఒప్పుకోలేదు. గుజరాత్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికార్లు ఏకగ్రీవంగా ఇష్రాత్ జహాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన, తీవ్రవాది అని తేల్చారు. అమె ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులను వెంటబెట్టుకొని నరేంద్ర మోదీ-అమిత్ షాలను చంపడానికి అహమ్మదాబాద్‌లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలిసిన పోలీసులు పట్టుకొనడానికి వెళ్లినప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్రాత్ జహాన్ సహా నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. ‘మణీ’ ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని చిత్రించాలి. దానివల్ల నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో ఓడిపోతాడు అని చెప్పాడు సురేశ్ వర్మ. ఐతే మణి రెండవ అఫిడవిట్ రాయడానికి ఒప్పుకోలేదు. సురేశ్ వర్మ ఆగ్రహంతో వెళ్లిపోయారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వ్యాపారాలు చేయడం తప్పుకాదు. కాని దొంగ వ్యాపారాలు చేయడం పన్నులు ఎగ్గొట్టడం తప్పు. ఎయిర్ సెల్, మాక్సిస్‌పై, ఇడి-ఐటిలు జరిపిన దాడుల్లో లభ్యమైన పత్రాల ప్రకారం చిదంబరం తనయుడు తండ్రిని అడ్డంపెట్టుకొని చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక రెండవ అంశం లా చదివినవాడు అఫిడవిట్ డ్రాఫ్ట్ చేయడం తప్పుకాదు. కాని సోనియాగాంధీని సంతృప్తి పరచడం కోసం రాజకీయంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అస్తిత్వాన్ని నిర్మూలించడం కోసం స్వయంగా భారతదేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి దొంగ సర్ట్ఫికెట్‌ను డ్రాఫ్ట్ చేయడం నేరమవుతుంది. అంతేకాదు దేశ భద్రతను తాకట్టు పెట్టడం దుర్మార్గం. ఒక కీలక పత్రం విడుదల కావాలంటే దానిని అండర్ సక్రెటరీ, సెక్రెటరీకి చూపించాలి. ఆ తర్వాత మంత్రి సంతకం చేయాలి. ఇక్కడ చిదంబరం ఏ అధికారిని సంప్రదించలేదు. కాని ఆయన సంప్రదించింది పరిపాలనా యంత్రాంగంతో ప్రత్యక్ష సంబంధం లేని 10, జనపథ్ అధినేత్రిని! ఇందులో రహస్యం ఏమీ లేదు. ‘రెండవ అఫిడవిట్‌ను నేనే రూపొందించాను’ అని స్వయంగా చిదంబరమే ఒప్పుకున్నారు.
ఇంగ్లీషులో ‘టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్’ అనే ఒక ప్రయోగం ఉంది. గుమ్మడికాయలో ఆవగింజంత అని దీని అర్థం. ఇప్పుడు మనకు తెలిసింది, ఈ ఆవగింజంత మాత్రమే. రాజకీయ లబ్దికోసం మనవాళ్లు దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ఈ ఉదంతం ద్వారా తెలుస్తున్నది. అప్పుడు న్యాయశాఖామాత్యులుగా ఉన్న వీరప్ప మొయిలీని విలేకర్లు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా అన్నాడు. ‘‘వయసులో పెద్దవాడిని. జ్ఞాపకశక్తి తగ్గుతున్నది. ఈ ఇష్రాత్ జహాన్ ఎమిటో, అఫిడవిట్లు ఏమిటో ఎన్‌కౌంటర్ ఏమిటో ఎలా గుర్తుంటుంది?’’ వీరప్పగారు చెప్పిన ఈ సమాచారాన్ని అం దరూ ఒక ఇంగ్లీషు ఛానల్‌లో చర్చించారు. పాక్ ఉగ్రవాదులు అమ్జద్ అలీ, అక్బరీ అలీలను ఎన్‌కౌంటర్ చేయడం ఎందుకు? పట్టుకొని విచారిస్తే సరిపోయేది కదా అని నరేంద్ర మోదీని ఆక్షేపించారు. బాబూ! నీ చేతిలోని బాంబులు అవతల పారెయ్యి. ఇది గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం-అని శాంతి పాఠం ఎందుకు వల్లించలేదనేది వీరి బాధ!
గుజరాత్‌లోని ఒక యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ఇలా అన్నారు.‘‘నరేంద్ర మోదీ హిం దూ ముస్లిం భేదం పాటించకుండా అందరి అభివృద్ధికి గుజరాత్‌లో పాటుపడుతున్నాడు,’’ అని. వెంటనే యుపిఏ ప్రభుత్వం ఆ వైస్‌ఛాన్స్‌లర్‌ను పదవినుంచి తప్పించింది. దీనికి సోనియాగాంధీ భటులు ఏమి సమాధానం చెబుతారు? బిజెపి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు 2016, మార్చి 2న పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘మనం ప్రజాస్వామ్య వ్యవస్థ గల దేశంలోనే ఉన్నాం. మరి ఈ నియంతృత్వపు పోకడలు ఏమిటి? హోం శాఖ అండర్ సెక్రెటరీకి వాతలు పెట్టి అర్థరాత్రి సంతకాలు పెట్టించుకోవడం ఏమిటి? దీనికి రాహుల్, చిదంబరం సమాధానం చెప్పాలి.’’
చిదంబరంపై లోగడ 2జి-స్పెక్ట్రమ్ కేసు ఉన్నది. ఇందులో డిఎంకె సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె కాంగ్రెస్‌తో కలిసి తమిళనాడులో పోటీ చేయబోతున్నాయి. ఇందులోని ఆంతర్యం చిదంబరం చాలా కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇవన్నీ కోర్టు విచారణ స్థాయిలో ఉన్నాయి. వీటన్నింటి నుంచి చిదంబరం ఎలా బయటపడతాడో చూడాలి. ఇష్రాత్ జహాన్‌ను అమరవీర వనితగా సృష్టించి ముస్లిం ఓట్లను మూకుమ్మడిగా కొల్లగొట్టాలన్నదే సోనియా వ్యూహం. గౌరవ భాటియా కార్తికేయన్ వంటి వారు ఇప్పటికీసోనియాగాంధీని, చిదంబరం అఫిడవిట్లనే బలపరుస్తున్నారు. ఒక వౌలిక ప్రశ్న. అసలు యుపిఎ ప్రభుత్వం మొదటి అఫిడవిట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? 2016,మార్చి 10న మాజీ సిట్ చీఫ్ ఒక ఇంగ్లీషు ఛానల్‌లో మాట్లాడుతూ ‘ఇష్రాత్‌ను అడ్డం పెట్టుకొని నరేంద్ర మోదీని ఫిక్స్ చేయండి’ అని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశం వచ్చినట్టు వెల్లడించారు. 2016, మార్చి 3న సతీష్ వర్మ ఒక ఇంగ్లీషు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘రెండవ అఫిడవిట్ డ్రాఫ్ట్ చేయడంలో చిదంబరం ప్రమేయం ఏమీ లేదు’’ అని అన్నాడు. ఇదే నిజమైతే ఈ విషయం సతీష్ వర్మ అప్పుడెందుకు చెప్పలేదు?
తెలంగాణ, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. కాంగ్రెస్ హయాంలో మహారాష్టల్రో ఏకంగా 1800 ఎన్‌కౌంటర్లు జరిగాయి. మరి కేవలం గుజరాత్ ఎన్‌కౌంటర్‌కే ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారు? కేవలం నరేంద్ర మోదీని అప్రదిష్ఠ పాలు చేయడానికే కదా! మాజీ హోంశాఖ జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ జైన్ 2016, మార్చి 5న ఇలా చెప్పారు. ‘‘మావద్ద ఉన్న సమాచారం మొత్తం పరిశోధనా సంస్థకు స్వాధీనం చేశాం. అందులో ఇషత్ జహాన్‌కు లష్కరే తయ్యబా సంస్థతో ఉన్న సంబంధాలు స్పష్టంగా వెల్లడి అయినాయి.’’ ఇంతటి నేపథ్యం ఉన్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని దిగ్విజయ్ సింగ్‌లు, సంజయ్ ఝూలు సోనియా-రాహుల్ కుటుంబాన్ని వెనకేసుకొని రాగలరు?

-ముదిగొండ శివప్రసాద్