క్రీడాభూమి

గెలిస్తేనే నిలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ పోరు
ముంబయి, మార్చి 17: క్రిస్ గేల్ విధ్వంసంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కంగుతిన్న ఇంగ్లాండ్ శుక్రవారం దక్షిణాఫ్రికాతో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఈ టోర్నీలో నాకౌట్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా దక్షిణాఫ్రికా చేతిలో ఓడడమేగాక, టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ తీవ్రమైన ఒత్తిడి నడుమ మైదానంలోకి దిగనుంది. వనే్డల్లో అత్యంత వేగవంతమైన 50, 100, 150 పరుగుల మైలురాళ్లను చేరుకున్న బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్‌తోపాటు ఫఫ్ డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, హషీం ఆమ్లా, క్వింటన్ డికాక్ వంటి సమర్థులైన బ్యాట్స్‌మెన్ ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించడం అనుకున్నంత సులభం కాదని ఇంగ్లాండ్‌కు తెలుసు. అయితే, స్పిన్నర్లు అదిల్ రషీద్, మోయిన్ అలీ శక్తిసామర్థ్యాలపై భారం వేసి దక్షిణాఫ్రికాను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నది. కాగా, స్థూలంగా చూస్తే ఇంగ్లాండ్ కంటే దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపిస్తున్నది. విజయావకాశాలు కూడా ఆ జట్టుకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, అమీతుమీ తేల్చుకోవాల్సిన స్థితిలో ఇంగ్లాండ్ ఎదురుదాడికి దిగితే మాత్రం ఫలితం ఆ జట్టుకు అనుకూలంగా రావచ్చు. ఆస్ట్రేలియా ఈ వాస్త వాన్ని గ్రహించి అన్ని విధాలా సిద్ధమవుతున్నది.
** మ్యాచ్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.