జాతీయ వార్తలు

వాస్తవాలు సేకరిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ విద్యార్థులకు జరిగిన పరాభవంపై అమెరికా
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: రెండు విద్యాసంస్థల్లో చేరడానికి వచ్చిన భారతీయ విద్యార్థులను ప్రవేశాలు కల్పించకుండా తిప్పి పంపడం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాల పట్ల అమెరికా గురువారం విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటన తరువాత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరిస్తున్నామని తెలిపింది. కాలిఫోర్నియాలోని రెండు విద్యాసంస్థలలో చేరడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులను భౌతికంగా చిత్రహింసలకు గురిచేసి తిప్పిపంపిన తరువాత, అమెరికా వెళ్లాలనుకునే వారు ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవాలని భారత్ బుధవారం తన విద్యార్థులకు సూచించిన విషయం తెలిసిందే. సరయిన వీసాలు కలిగి ఉన్నప్పటికీ భారతీయ విద్యార్థులకు కలిగిన చేదు అనుభవం పరిష్కారం అయ్యేవరకు అమెరికా వెళ్లొద్దని భారతీయ విద్యార్థులకు భారత్ స్పష్టం చేసింది. దీంతో భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ గురువారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో జరిగిన సంఘటనల పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘కాలిఫోర్నియాలోని రెండు విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడానికి కొంతమంది భారతీయ విద్యార్థులను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నిరాకరించినట్లు వచ్చిన వార్తలు ఎంబసీకి తెలుసు. దీని ప్రభావం సదరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై పడటం పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. మేము పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్స్‌తోనూ, భారత ప్రభుత్వంతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరిస్తున్నాం’ అని వర్మ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో విద్యనభ్యసించేందుకు సరయిన వీసాలు కలిగి ఉన్నప్పటికీ రెండు విద్యాసంస్థలు- సాన్‌జోస్‌లోని సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, ఫ్రెమంట్‌లోని నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీలో ప్రవేశాలకు నిరాకరించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ప్రవేశాల నిరాకరణకు కారణాలు తెలపాలని భారత్ ఇదివరకే అమెరికాను కోరింది. అమెరికా నుంచి సమాధానం కోసం వేచిచూస్తోంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను వాయిదా వేసుకోవాలని భారత్ బుధవారం తన విద్యార్థులకు సూచించింది. (చిత్రం) అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ