బిజినెస్

పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ పెరిగిన ఎక్సైజ్ సుంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీటర్ పెట్రోల్‌పై 0.37 పైసలు, డీజిల్‌పై రూ. 2 చొప్పున వడ్డన

న్యూఢిల్లీ, జనవరి 2: కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 0.37 పైసలు, లీటర్ డీజిల్‌పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్ను పెరిగింది. గడచిన మూడు వారాల్లో ఈ పెంపు రెండోది కావడం గమనార్హం. కాగా, తాజా పెంపువల్ల రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచకపోవడమే దీనికి కారణం. ఇకపోతే డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపుతో రూ. 4,300 కోట్లకుపైగా, పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను పెంపుతో సుమారు రూ. 80 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి పెరగనుంది. గత నెల డిసెంబర్ 17న కూడా లీటర్ పెట్రోల్‌పై 0.30 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ. 1.17 మేర ఎక్సైజ్ పన్నును కేంద్రం పెంచింది.

నాలుగు శాతం పెరిగిన టివిఎస్ మోటార్ అమ్మకాలు
న్యూఢిల్లీ, జనవరి 2: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటార్ సంస్థ అమ్మకాలు గత నెల డిసెంబర్‌లో 4 శాతం పెరిగాయి. మొత్తం 2,02,086 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో ఇవి 1,94,481 యూనిట్లుగా ఉన్నాయి. ఈసారి మోటార్‌సైకిల్ అమ్మకాలు 71,435 యూనిట్లుగా, స్కూటర్ విక్రయాలు 65,090 యూనిట్లుగా, ఎగుమతులు 32,771 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు శనివారం సంస్థ తెలియజేసింది.

అశోక్ లేలాండ్ విక్రయాలు 31 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జనవరి 2: హిందుజా గ్రూప్‌నకు చెందిన సంస్థ అశోక్ లేలాండ్ అమ్మకాలు గత నెల డిసెంబర్‌లో 31.4 శాతం పెరిగి 12,209 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు డిసెంబర్‌లో 9,290 యూనిట్లుగా ఉన్నాయి. భారీ, మధ్యతరహా శ్రేణి వాణిజ్య వాహనాల అమ్మకాలు డిసెంబర్‌లో 35.33 శాతం పెరిగి 9,758 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఇది 7,210 యూనిట్లుగా ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహన విక్రయాలు గతంతో పోల్చితే 17.83 శాతం పెరిగి 2,080 యూనిట్ల నుంచి 2,451 యూనిట్లకు ఎగబాకాయి.