రాష్ట్రీయం

ఎక్సైజ్ పాలసీపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ పాలసీ అమలుపై నెల రోజుల పాటు స్టే విధిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ జారీ చేశారు. బార్‌ల ఏర్పాటుపై ముందు వచ్చిన వారికి ఇచ్చే విధంగా ఎక్సైజ్ విధానం ఉందంటూ కొంతమంది ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ జీవో ఏకపక్షంగా ఉందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. బార్ల ఏర్పాటులో అనవసర పోటీని నివారించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ఎక్సైజ్ శాఖ న్యాయవాది విజయ్ భాస్కర్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే 300 లైసెన్సులను ప్రభుత్వం క్లియర్ చేసిందని, కొత్త పాలసీ కింద రాష్ట్రంలో 716బార్లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్ల లైసెన్సును ఒక నెల రోజులపాటు పొడిగించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసును సంక్రాంతి తర్వాత విచారిస్తామని వాయిదా వేశారు.