అంతర్జాతీయం

ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు అమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 26: పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రతినిధుల సభలో ఒక సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరోవైపు, అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం గల ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి జాన్ కెర్రీ శుక్రవారం గట్టిగా సమర్థించుకున్నారు. ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్‌కు ఈ విమానాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను పాకిస్తాన్ ప్రభు త్వం తన స్వంత ప్రజలను ము ఖ్యంగా బలూచిస్తాన్‌లోని ప్రజలను అణచివేయడానికి ఉపయోగిస్తోంది’ అని కాంగ్రెస్ సభ్యుడు డానా రోహ్రబచర్ గురువారం ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం అన్నారు. ‘ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు సహకరించిన వ్యక్తినే పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేస్తోంది. అందువల్ల నేను ఈ సంయుక్త తీర్మానానికి మద్దతిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 700 మిలియన్ డాలర్ల విలువ గల ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు అమ్మాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా పాలనాయంత్రాంగం ఈ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. 2001 సెప్టెంబర్ 11న మూడు వేల మంది అమెరికా ప్రజలను సామూహికంగా హతమార్చిన హంతకుడు ఒసామా బిన్ లాడెన్ అని విమర్శిస్తూ, అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు సహకరించిన ఎవరైనా ‘అమెరికన్ హీరో’నే అని రోహ్రబచర్ పేర్కొన్నారు. ‘పాకిస్తాన్ ప్రభుత్వం షకీల్ అఫ్రిదీని అరెస్టు చేసి, కటకటాల పాల్జేసింది. అఫ్రిదీని అరెస్టు చేయడం అమెరికా పట్ల శత్రుత్వాన్ని ప్రకటించడమే అవుతుంది’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ అఫ్రిదీని నిర్బంధించినంత కాలం ఆ దేశానికి ఎఫ్-16 యుద్ధ విమానాలే కాకుండా ఎలాంటి ఆయుధాలను అమెరికా సరఫరా చేయకూడదని ఆయన పేర్కొన్నారు. అఫ్రిదీని విడుదల చేసేంత వరకు పాకిస్తాన్ మనకు శత్రుదేశమే తప్ప మిత్రదేశం ఎంతమాత్రం కాబోదని ఆయన అన్నారు. అంతకుముందు మాజీ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, సెనేటర్ రాండ్ పౌల్ ఈ సంయుక్త తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.