ఫోకస్

ప్రైవేట్ వర్శిటీలతో అశాంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేట్ యూనివర్శిటీలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీలు పడి భూములు కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యా రంగం నిర్వీర్యమవుతుంది. విద్యారంగం ఎప్పుడూ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. కాని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఎడాపెడా అనుమతులు ఇవ్వడంవల్ల సామాజిక సంక్షేమం, సమతుల్యత దెబ్బతింటుంది. భవిష్యత్తులో అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తి, అశాంతికి కారణమవుతుంది. సామాజిక న్యాయం అనే దానికి అర్థం లేకుండా పోతుంది. ఆంధ్రాలో ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర, నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ వర్శిటీలు, తెలంగాణలో ఘనమైన చరిత్ర ఉన్న ఉస్మానియా వర్శిటీ ఉన్నాయి. ఈ వర్శిటీల నుంచి వచ్చిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ వర్శిటీలకు తగిన నిధులు ఇవ్వడం లేదు. ఫ్యాకల్టీని భర్తీ చేయడం లేదు. విద్యార్థులకు తగిన హాస్టళ్లు లేవు. ఉన్నావాటికి మరమ్మత్తు లేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ వర్శిటీలకు అనుమతులు ఇచ్చారు. విద్యార్థులు, ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా కొన్ని ప్రైవేట్ వర్శిటీలకు అనుమతి ఇచ్చినా, వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత