అంతర్జాతీయం

చెక్కుచెదరని మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 1: ఏడు దశాబ్దాల భారత్-రష్యా అనుబంధం కొత్త పుంతలు తొక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ముక్తకంఠంతో ఉగ్రవాదంపై నిప్పులు చెరిగాయి. తమిళనాడులోని అణు ఇంధన కర్మాగారానికి సంబంధించి మరో రెండు విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించడంతో పాటు పరస్పర సైనిక బంధానికీ కొత్త శక్తి నివ్వాలనీ సంకల్పించాయి. వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్-నరేంద్ర మోదీ మధ్య విస్తృత స్ధాయిలో గురువారంనాడిక్కడ కీలక చర్చలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టిపెట్టాలని, ఉగ్రవాదుల కదలికలను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ద్వంద్వ ప్రమాణాలకు తావులేకుండా ప్రపంచ దేశాలన్నీ నడుంబిగించాలని మోదీ-పుతిన్‌లు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రష్యా ముందుకు రావడాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ ‘ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది అఫ్గాన్ అయినా మధ్య ప్రాచ్య అయినా కూడా ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నదే ఇరు దేశాల కృత నిశ్చయమం’అని ఉద్ఘాటించారు. సైద్ధాంతికంగా, మతపరంగా, రాజకీయంగా ఇలా ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం సమర్థనీయం కాదని మోదీ అన్నారు. రష్యాతో భారత సంబంధాలు కాలపరీక్షకు నెగ్గినవని, పరస్పర ప్రేమ, గౌరవం, విశ్వాసమే వీటికి బలమైన పునాదిగా పనిచేసిందని తెలిపారు. సంస్కృతి నుంచి రక్షణ వరకూ ఇదే స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నామని, ఇందుకోసం కార్యాచరణ పథకాన్ని కూడా రూపొందించామని తెలిపారు. మైత్రీ బంధంలో ఇరు దేశాలు 70యవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, ఇనే్నళ్లుగా చెక్కుచెదరని రీతిలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. మోదీతో తాను జరిపిన చర్చలు విస్తృత స్థాయిలో సాగాయని, ఇరు దేశాల భాగస్వామ్యం వ్యూహాత్మక రీతిలో అత్యంత ప్రాధాన్యతాయుతంగా సాగుతోంది పుతిన్ అన్నారు. ఈ చర్చల సందర్భంగా పీటర్స్‌బర్గ్ ప్రకటనను, 21వ శతాబ్ద లక్ష్యాలను కూడా ఇరువురు నేతలు అందించారు. రక్షణ రహకారాన్ని కొత్త పుంతలు తొక్కించే విధంగా కూడా చర్యలు చేట్టారు. ‘ఇంద్ర 2017’పేరుతో తొలిసారిగా సంయుక్తంగా త్రివిధ దళాల విన్యాసాలను నిర్వహించాలని సంకల్పించారు.