జాతీయ వార్తలు

సాగని కృష్ణా కేటాయంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ మార్చి 26కి వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నదీ జలాలను ఆంధ్ర, తెలంగాణ మధ్య పంపకాల చేసేందుకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వరుసగా రెండో రోజూ వాదనలు సాగాయ. ఏపీ తరఫున వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణ, తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలైన నేలల స్వభావం, వ్యవసాయం, శీతోష్ణస్థితి, మండలాలు, పంట సమయంలో నీటి పారుదల తదితర అంశాలపై తెలంగాణ తరఫు న్యాయవాది ప్రశ్నలు సంధించారు. ఏపీ బేసిన్‌లో ప్రధానంగా వరి పండిస్తారా? తెలంగాణలో కృష్ణా బేసిన్ పరిధిలో అరుతడి పంటలు
వేస్తారా? అని తెలంగాణ తరపు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సత్యనారాయణ సమాధానాలు ఇచ్చారు. వ్యవసాయ శీతోష్ణస్థితి మండడాలు పరిగణనలోకి తీసుకోనే ఏపీ, తెలంగాణ భూములకు సరిపడే పంటలను అధ్యయనంలో వెల్లడించినట్టు చెప్పారు. సాగునీటి అవసరాలకు సంబంధించిన నీరు ఇంకిపొయే నష్టాలను ఎఫ్‌ఏవో మాన్యువల్ నుంచి తీసుకున్నట్టు ఏపీ తరఫు న్యాయవాది తెలిపారు. పరస్పర వాదనల అనంతరం హైడ్రాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది సమర్పించాల్సిన ప్రమాణ పత్రాన్ని తదుపరి విచారణకన్నా ముందే అందజేయాలని ట్రిబ్యునల్ సూచించింది. తదుపరి వాదనలను మార్చి 26 నుంచి 28 మధ్య వినిపించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.