ఆంధ్రప్రదేశ్‌

సీమలో రెండో రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 23: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరగకుండా రెండో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి గతంలో ఏర్పాటు చేసిన సీమ అభివృద్ధి బోర్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీమ అభివృద్ధి బోర్డుకు రూ.10వేల కోట్ల నిధి కేటాయించి, రాజ్యంగబద్ధంగా చట్టబద్ధత కల్పించాలన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ రాయలసీమ ముఖ్యనేతలు సమావేశమై పలు తీర్మానాలు చేశారు. అనాదిగా సీమకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావిస్తూ కర్నూలు డిక్లరేషన్ -2018 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గత ముఖ్యమంత్రుల్లాగానే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ హైదరాబాద్ తరహాలో అభివృద్ధిని అమరావతి చుట్టూ చేపడుతున్నారని, అలాకాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని సమానంగా చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.
రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలన్నారు. అదే విధంగా తాత్కాలిక హైకోర్టును సైతం ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టు సాధన కోసం ఈనెల 28న కడపలో పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సీమలో 1100 అడుగుల లోతుకు నీళ్లు పడిపోయాయన్నారు. ఇక్కడి జనం నిత్యం కరవు కాటకాలతో విలవిల్లాడుతున్నారన్నారు. వీటికి తోడు నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. అయినా ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2018-19 బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలన్నారు. గత బడ్జెట్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య, వలసలు ఆపేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల ప్రత్యేకనిధి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే మూడున్నరేళ్లలోలో చేసిన అభివృద్ధిపై శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన సీమకు నిధులు ఖర్చుపెట్టాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాయలసీమను 8 జిల్లాలుగా విభజించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నాలతో సమానంగా సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ప్రారంభించిన గాలేరు-నగరి, హంద్రీనీవా, గురురాఘవేంద్ర ప్రాజెక్టులను 2019లోపు పూర్తిచేయాలని, వాటితో పాటు గుండ్రేవుల జలాశయం నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని, పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టల్లో వందల కోట్ల అవినీతి జరిగిందని, వాటిపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. సీమ జిల్లాల్లో మూతబడిన పరిశ్రమలను తెరిపించాలని, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య, జాతీయ కార్యవర్గసభ్యులు శాంతారెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, సందడి సుధాకర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరీష్‌బాబు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

chitram..
కర్నూలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి