రాష్ట్రీయం

ఫీజుల మోత... పట్టించుకోని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుకుంటూపోతున్నా వారిని ప్రశ్నించే నాధుడే లేకుండా పోయారు. మిగిలిన ఏ శాఖల్లో లేని విధంగా క్షేత్రస్థాయి వరకూ పాఠశాల విద్యకు యంత్రాంగం ఉన్నా, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల జులుం యథేచ్ఛగా కొనసాగుతోంది. జాతీయ ప్రమాణాల ప్రకారం ఏటా 10 శాతం వరకూ ఫీజులను పెంచుకునే సౌలభ్యం ఉండగా, కొన్ని స్కూళ్లు ఏకంగా వంద నుండి 400 శాతం వరకూ ఫీజులను పెంచుతున్నాయి.
తల్లిదండ్రులు నిలదీస్తే వారి పిల్లలపై విద్యాసంస్థల యాజమాన్యాలు పగతీర్చుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల వ్యవహారంపై నియమించిన కమిటీలు, వాటి నివేదికలను గాలికి వదిలేశారు. గత ఏడాది 12 స్కూళ్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వ అధికారులు వాటిపై నివేదికలను గోప్యంగా ఉంచింది, ఇంతవరకూ ఆ స్కూళ్లపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విడ్డూరం. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల కాకుండా ముందుగానే అడ్మిషన్లను చేపడుతున్న ప్రైవేటు స్కూళ్లు ఫీజులపై నియంత్రణ లేకుండా పోయింది. ప్రభుత్వ ధోరణి, యాజమాన్యాల దోపిడీపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విక్రాంత్, సుబ్బు, శివ, సీమ, కమాల్ తదితరులు శుక్రవారం నాడు దుయ్యబట్టారు.
యాజమాన్యాల దోపిడీ చూస్తుంటే ప్రభుత్వానికి ఉన్న అధికారాలను సైతం విస్మరించినట్టు ఉందని అన్నారు.క్యాపిటేషన్ ఫీజు చట్టం 1983, జిఓ ఎంఎస్ నెంబర్ 1 రూల్ 17, 18.4, 18.5, 19, 20, జీవో 91 సెక్షన్ 1(ఎ), సెక్షన్ 1(సి), జీవో ఎంఎస్ 91 సెక్షన్ 8, 1987 జీవో ఎంఎస్ 246 ప్రకారం ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తల్లిదండ్రులే నియమనిబంధనలు తెలియజెప్పాల్సిన దురవస్థ వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 61 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారని అందులో 30.58 లక్షల మంది విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారని వారు చెప్పారు. ఒక్కో విద్యార్ధి సగటున 10 వేల రూపాయిలు ఫీజు చెల్లిస్తుంటే 300 కోట్ల రూపాయిల వ్యాపారం జరుగుతోందని 20వేలు సగటున వసూలుచేస్తే ప్రైవేటు ఫీజుల వ్యాపారం 600 కోట్లు అవుతుందని అన్నారు. గత ఏడాది ఆగస్టులో 12 స్కూళ్లలో ఫీజుల వ్యవహారంపై ఫైనాన్షియల్ ఆడిట్ చేయిస్తామని పేర్కొన్నారని, ఆ ఆడిట్ నివేదికను బహిర్గతం చేయాలని వారు చెప్పారు.
ఫీజుల వసూలు, పాఠశాలల ఉల్లంఘనలను నియంత్రించే నియమనిబంధనలను స్పష్టమైన మార్గదర్శకాలతో జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్కూల్ ఫీజుల నియంత్రణకు సైతం ఎఎఫ్‌ఆర్‌సిని నియమించాలని వారు కోరారు. చిరేక్ విద్యాసంస్థ ఫీజు గత ఏడాది 1,98,090 కాగా, 2016-17లో ఫీజు 3,00,000కు పెంచారని, అలాగే మంథన్ ఫీజు 1,09,000 కాగా అది ఈ ఏడాది 1.40 లక్షలకు, గ్లేండేల్ ఫీజు 1,61,525 నుండి 1,95,000, ఓక్రిడ్జి స్కూల్ ఫీజు 3,15,300 రూపాయిల నుండి 3,49,600 రూపాయిలకు పెంచారని వారు చెప్పారు. అంటే చిరేక్ ఫీజు ఈ ఏడాది 51 శాతానికి పెంచగా, మిగిలిన స్కూళ్లు 11 శాతం నుండి 28 శాతం వరకూ పెంచాయన్నమాట.