ఆంధ్రప్రదేశ్‌

నకిలీ మందుల కేంద్రంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, డిసెంబర్ 17 : ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడులో ఆయుర్వేద మందుల పేరుతో తయారు చేస్తున్న నకిలీ మందులను ఔషధ నియంత్రణ అధికారి షేక్ ఆబిద్‌అలీ బుధవారం రాత్రి దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయల విలువైన నకిలీ ఔషధాలను, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆబిద్‌అలీ అందించిన వివరాల మేరకు, తర్లుపాడు కేంద్రంగా మార్చుకొని బాలాజీ ఆయుర్వేద నిలయం పేరుతో నకిలీ మందులను తయారు చేస్తున్నారని, మందులను వాడడం ద్వారా పలు సమస్యలు తలెత్తడంతో బాధితులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేంద్రంపై దాడులు నిర్వహించినట్లు వివరించారు.