రాష్ట్రీయం

నకిలీ వీసాలతో గల్ఫ్‌దేశాలకు వెళ్తూ పట్టుబడిన కడప మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 28: కడప జిల్లాకు చెందిన 11 మంది మహిళలు నకిలీవీసాలతో గల్ఫ్‌దేశాలకు వెళ్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మూడు దశాబ్దాలుగా జిల్లా నుంచి సుమారు 50వేల మంది మహిళలు జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టారు. గత కొనే్నళ్లుగా గల్ఫ్‌లో ఉపాధి నిమిత్తం రాకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో మహిళలు అక్కడ ఉన్న యజమాని ద్వారా వీసాలు తెప్పించుకొని వెళ్తున్నారు. కొంతమంది బ్రోకర్లు, ఏజెంట్లు రకరకాల వీసాలు సృష్టించి మహిళలను మోసగిస్తున్నారు. గతంలో బెంగుళూరు, చెన్నై విమానాశ్రయాల ద్వారా అధిక సంఖ్యలో గల్ఫ్‌కు వెళ్లేవారు. అక్కడ తనిఖీలు ఎక్కువ కావడం, ఇమిగ్రేషన్ అధికారులు ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే మహిలను విమానాశ్రయాల్లో అడ్డగించి ఇళ్ళకు పంపుతున్నారు. దీన్ని పసిగట్టిన నకిలీ ఏజెంట్లు, దళారులు తమ కున్న పలుకుబడి ఉపయోగించి అడపాదడపా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గల్ఫ్‌దేశాలకు మహిళలను పంపుతున్నారు. ఇదే క్రమంలో 11మంది మహిళలకు నకిలీ వీసాలు సృష్టించి జిల్లాకు చెందిన 11 మంది మహిళలను శనివారం షంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేర్చారు. అక్కడ టాస్క్ఫోర్స్, ఇమిగ్రేషన్, భద్రతాధికారులు తనిఖీ చేయగా, ఈ వీసాలు నకిలీవని తేలడంతో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇది తెలుసుకున్న నకిలీ ఏజెంట్లు , దళారులు పరారయ్యారు. ఎయిర్ పోర్టులో తనిఖీలు లేని సమయంలో అదునుచూసుకుని చాలాకాలంగా నకిలీ వీసాలతో పంపడం, అక్కడ మహిళలు అవస్థలు పడటం, భారత రాయబారులు గుర్తించి స్వదేశాలకు పంపడం పరిపాటిగా మారింది.