బిజినెస్

‘ఫేమ్-ఇండియా’తో రూ. 60 వేల కోట్ల ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందిస్తున్న ఫేమ్-ఇండియా పథకం వల్ల 2020 నాటికి దేశ చమురు దిగుమతి వ్యయంలో సాలీనా 60 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని భారత ప్రభుత్వం తెలిపింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అంబుజ్ శర్మ పిటిఐ వార్తా సంస్థకు ఈ విషయం చెప్పారు. ‘ఈ పథకం కోసం తొలి రెండేళ్లు 800 కోట్ల రూపాయల వ్యయం చేస్తాం. ఈ పథకాన్ని విజయవంతం చేయాలంటే మొత్తం 14 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ వ్యయం ద్వారా 60 వేల కోట్ల రూపాయల విలువ గల ఇంధనాన్ని ఆదా చేస్తాం’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. హైబ్రిడ్, ఎలక్ట్రికల్ వాహనాల ప్రదర్శనలో పాల్గొన్న గీతే విడిగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.