రాష్ట్రీయం

రాజధాని రైతులకు 8,500 ఎకరాల్లో స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

125 గజాల కేటాయింపునకు ప్రతిపాదన
భూములిచ్చిన రైతులు 21,500 మంది
గుంటూరు, నవంబర్ 28: రాజధాని నిర్మాణాలకు భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపునకు 8,500 ఎకరాలు అవసరమని సిఆర్‌డిఎ అధికారులు గుర్తించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 21,500 మంది రైతులు భూసమీకరణ ద్వారా పొలాలను అందజేశారు. ప్రభుత్వం 33,000 ఎకరాలు ఇచ్చినట్లు స్వయంగా ప్రకటించింది. 29 గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా 40 శెంట్లు, 60 శెంట్లు భూములు కూడా భూ సమీకరణ కింద ప్రభుత్వానికి అందజేశారు. కౌలు పరిహారాల కింద ఎకరాకు 30 వేల రూపాయలు చెల్లించారు. ఆ విధంగానే 40 శెంట్లు భూమి ఇచ్చిన రైతుకు కూడా రూ.30 వేల రూపాయల చెల్లింపులు జరిగాయి. స్థలాల కేటాయింపు మాత్రం రైతు ఇచ్చిన భూమిని లెక్క గట్టి అందుకు అనుగుణంగా అందజేస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా భూములిచ్చిన రైతులు గ్రూపుల వారీగా స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నవంబర్ 31వ తేదీ వరకు గడువుఇచ్చింది. అయితే రైతులు గ్రూపులుగా దరఖాస్తు చేసుకునేందుకు అంగీకరించలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేయటమే కాకుండా ముందుగా స్థలాలను ఎక్కడ కేటాయిస్తారో వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో సిఆర్‌డిఎ అధికారులు రైతులకు కేటాయించాల్సిన స్థలాలపై నివేదికను రూపొందించారు. 29 గ్రామాల్లో గల భూములను మెట్ట, జరీబు భూములుగా ప్రభుత్వం గుర్తించింది. జరీబు భూములిచ్చిన రైతులకు 1000 గజాల ఇంటి స్థలం, 350 గజాల వాణిజ్య స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. మెట్ట రైతులకు 1000 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనుంది. ఈ ప్రాతిపదికన రైతులకు స్థలాలు కేటాయించాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ నాటికి స్థలాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. సిఆర్‌డిఎ అధికారులు మాత్రం కొత్త ప్రతిపాదనను రైతుల ముందు ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు.