రాష్ట్రీయం

రైతుల ఆత్మహత్యల నివారణపై 30న సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 28: రైతుల ఆత్మహత్యల నివారణపై వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ నెల 30వ తేదీన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపి, తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని హైకోర్టు ఇటీవల ఆయా ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 30న సచివాలయంలోని డి-బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని, దీనిపై అన్ని వర్గాలకు లేఖలు రాశామని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సోమవారం హైకోర్టుకు తెలియజేస్తూ నివేదిక సమర్పించారు.

ప్రత్యూషకు ఆమె తల్లి ఇంటిని బదలాయించండి
టి.సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 28: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ప్రభుత్వ పర్యవేక్షణలో రక్షణ పొందుతున్న ప్రత్యూషకు ఆమె స్వంత తల్లి పేరున ఉన్న ఇంటిని బదలాయించాలని, అలాగే ఆ ఇంటిపై వస్తున్న అద్దెను కూడా ప్రత్యూష అక్కౌంట్‌లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ఈ విషయాన్ని తెలియజేసింది. అనంతరం ఈ కేసును కోర్టు వాయిదా వేసింది.