బిజినెస్

4 ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) మంగళవారం నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను ఆమోదించింది. 1,810 కోట్ల రూపాయల విలువైన ఈ ఎఫ్‌డిఐలలో హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైర్‌ఫ్లై నెట్‌వర్క్స్ లిమిటెడ్ తదితర సంస్థల ఎఫ్‌డిఐలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఎఫ్‌ఐపిబి బోర్డు సమావేశమై ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

బేస్ రేటును స్వల్పంగా తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మంగళవారం బేస్ రేటు లేదా కనీస రుణ రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. దీంతో ఇంతకుముందు వరకు 9.35 శాతంగా ఉన్న బేస్ రేటు.. ఇప్పుడు 9.30 శాతానికి వచ్చింది. అన్ని రకాల రుణాలకు తగ్గిన బేస్ రేటు వర్తిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. కస్టమర్లకు బేస్ రేటు కంటే తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలివ్వకూడదన్నది తెలిసిందే.